Medchal Girl Students Protest: హైదరాబాద్ శివారులోని మేడ్చల్ వద్ద CMRIT గర్ల్స్ హాస్టల్ వద్ద అమ్మాయిలు ధర్నా చేపట్టారు. బాత్రూంలో విద్యార్థులు ఉండగా సిబ్బంది వీడియోలు తీసారని ఆరోపించారు. కళాశాల గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థి సంఘాల నాయకులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
జోక్యం చేసుకున్న మేడ్చల్ పోలీసులు సిఎంఆర్ గర్ల్స్ హాస్టల్ వద్దకు వచ్చి విచారణ చేపట్టారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు హాస్టల్‌లో వంట చేసే వారై ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులకు స్టూడెంట్ యూనియన్‌లు బాసటగా నిలిచారు. విషయం తెలుసుకున్న వెంటనే అక్కడకు చేరుకొని ధర్నా చేయడంతో యంత్రాంగం స్పందించింది. నలుగురు ఆకతాయిలను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అనుమానితులను అరెస్టు చేయడంతో విద్యార్థినులు ధర్నా విరమించారు.