CM Revanth Reddy Review: మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇందుకు ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
Revanth Reddy: మూసీ నది డెవలప్‌మెంట్‌పై రేవంత్ రెడ్డి రివ్యూ - అధికారులకు కీలక సూచనలు
ABP Desam
Updated at:
19 Feb 2024 06:19 PM (IST)
Development of Musi River Basin: మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
రేవంత్ రెడ్డి