Severe Blast in Scan Energy Factory in Kondurg in Rangareddy: రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో సోమవారం భారీ పేలుడు సంభవించింది.  కొందుర్గు మండల కేంద్రంలోని స్కాన్ ఎనర్జీ ఐరన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోగా.. ఫ్యాక్టరీలోని రేకులు చెల్లాచెదురుగా పడిపోయాయి. కార్మికులు పని చేస్తుండగా.. ఒక్కసారిగా పేలుడు సంభవించి వేడి ద్రవం వారిపై పడినట్లు తెలుస్తోంది. ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడగా.. వారిని తోటి సిబ్బంది షాద్ నగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పేలుడు ధాటికి పరిశ్రమ మొత్తం పొగ అలుముకోవడంతో ఆందోళనకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేసి సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా.? అనే సందేహంతో గాలిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.


మరో అగ్ని ప్రమాదం


అటు, ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. షేక్ పేట్ డివిజన్ ఫుట్ పాత్ మీద ఉన్న దుకాణాల్లో ప్రమాదం జరగ్గా.. ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు.


Also Read: Kakinada Accident: కాకినాడ జిల్లాలో ప్రమాదం - డ్రైవర్ కు అస్వస్థతతో తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తా