తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 నేటితో ముంగియనుంది. ముగిపు రోజు 20కి పైగా సమావేశాలు జరగనున్నాయి.  గ్లోబల్ సమ్మిట్ రెండవ రోజు సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడపనున్నారు. ఈరోజు దాదాపు 20 సమావేశాలలో పాల్గొనున్నారు, దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 గంటలకు ఎంసీహెచ్‌ఆర్‌డీ నుండి హెలికాప్టర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు. కీలక రంగాల ప్రతినిధులతో చర్చలు, ఒప్పందాలతోపాటు, ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. వీటిలో ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో పాటు వివిధ రంగాలు ఉన్నాయి.

Continues below advertisement

ఈ చర్చల తరువాత పలు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోనుంది. సాయంత్రం సీఎం, మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఈ భేటీలో ముఖ్యంగా గ్రీన్ వెహికిల్స్ (పర్యావరణ హిత వాహనాలు) మరియు రూరల్ ఎంటర్‌ప్రైజ్ (గ్రామీణ పారిశ్రామికీకరణ) రంగాల్లో పెట్టుబడులు, సహకారం గురించి చర్చిస్తారు. తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ, విజన్ డాక్యుమెంట్ విడుదల సమ్మిట్ రెండో రోజులో ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి.

ఉదయం 10:00 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాలను గ్లోబల్ సమ్మిట్ వేదిక నుంచి ముఖ్యమంత్రి వర్చువల్‌గా ఆవిష్కరిస్తారు. ఇది రాష్ట్ర సంస్కృతికి మరియు సెంటిమెంట్‌కు ప్రాధాన్యతనిచ్చే కార్యక్రమం. సాయంత్రం 6:00 గంటలకు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ముఖ్యమైన ఘట్టం ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌’ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. రాత్రి 7:00 గంటలకు, “Telangana is Rising – Come, Join the Rise” అనే థీమ్‌తో డ్రోన్ షో మరియు ఫైర్ వర్క్స్ (బాణాసంచా ప్రదర్శన) తో ఈ రెండ్రోజుల సమ్మిట్ ముగింపు వేడుక నిర్వహిస్తారు.

Continues below advertisement

గ్లోబల్ సమ్మిట్ యొక్క ప్రధాన లక్ష్యం మూలధనాన్ని (Capital), ఆధునిక సాంకేతికతను (Technology) ఆకర్షించడం. ప్రపంచ స్థాయి ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతం యొక్క బలం, విధానాలు మరియు పెట్టుబడుల స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రపంచానికి చాటిచెప్పడం. ఈ సమ్మిట్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంలో పూర్తి స్దాయిలో అనుకున్న టార్గెట్ చేరువైనట్లుగా ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమ్మిట్‌లో రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం, ఇది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి, ఉద్యోగ కల్పనకు గణనీయంగా దోహదం చేయనుంది. 

ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణలో అధికారం చేపట్టిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలకు గ్లోబల్ ప్రచారం కల్పించడంతోపాటు , పెట్టుబడులకు సింగిల్ లైన్ రూట్ మ్యాప్ తో తాము సిద్దంగా ఉన్నామనే సంకేతాలిచ్చినట్లయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ది జరగడంలేదు, రియల్ రంగం పడిపోయిందని ప్రతిపక్షపార్టీలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ , ప్రపంచ స్దాయిలో నూతన రాష్ట్రం ఎదగబోతోందని చెప్పే ప్రయత్నం చేసినట్లయ్యింది. అయితే సిమ్మిట్ లో తీసుకున్న నిర్ణయాలు ఆచరణలో రావడం, విజన్ డ్యాక్యూమెంట్లు కార్యరూపం దాల్చిడం సాధరణ విషయం కాదు. గ్లోబల్ ఆలోచనలతో ముందుకెళ్తున్న రేవంత్ సర్కార్ భవిష్యత్ లో ఫ్యూచర్ సిటీని ఏ స్దాయిలో అభివృద్ది చేయబోతోందో చూడాలి.