Revanth Reddy approves proposals for new flyovers in Hyderabad Outer Ring Road హైదరాబాద్: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపలి ఏరియాను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లో కొత్తగా మరో 7 ఫ్లైఓవర్లు (Flyovers in Hyderabad) నిర్మించాలన్న ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. 

నానక్‌రామ్‌గూడలోని హెచ్ఎండీఏ (HMDA) కార్యాలయంలో గురువారం రాత్రి ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి కోర్ అర్భన్ అభివృద్ధి అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా  సీఎం రేవంత్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా మొత్తం నిర్వహించాలని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల సౌకర్యార్థం కొత్తగా మరో 7 ఫ్లైఓవర్లు నిర్మించాలన్న ప్రతిపాదనలకు రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. 

సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..- ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించేలా నగరాన్ని తీర్చిదిద్దాలి. అందుకు వీలుగా హైదరాబాద్ సిటీలో గృహాలు, విద్యుత్ సౌకర్యం, మంచినీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలి.

- గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad)లో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతికతను వినియోగించుకుని నగరంలో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.

- కోర్ అర్బన్ ప్రాంతం (Hyderabad ORR) లోపలి ఏరియాలో చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు పూర్తి స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలి.

- హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే మరో 7 జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపట్టాలి. అందుకోసం ముందుగా భూసేకరణ, సంబంధిత పనులను పూర్తి చేసి, వీలైనంత త్వరగా టెండర్లకు ఆహ్వానించాలి. 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో మౌలిక సదుపాయాల సలహాదారు శ్రీనివాసరాజు, పురపాలక శాఖ, అర్బన్ డెవలప్ మెంట్ శాఖ కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ (GHMC Commissionr) ఇలంబర్తి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరోవైపు గురువారం నాడు హైదరాబాద్ గచ్చీబౌలీలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనంలో 2,500 మంది ఉద్యోగులు పనిచేసే వీలుంది.

Also Read: Google And Microsoft AI Centers In Hyderabad : తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు