KCR Wishes To Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 72వ పుట్టిన రోజు సందర్బంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగా, రాష్ట్ర ప్రజల తరఫున సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేవుడు మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నట్లు తెలిపారు. దేశానికి మోదీ మరింత కాలం సేవ చేయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. అలాగే సామాన్య ప్రజల నుంచి ప్రపంచ నేతల వరకు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను నెల రోజుల పాటు నిర్వహించబోతున్నారు. 




ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. సాటిలేని కరోఠన శ్రమ అంకితభావం, సృజనాత్మకతతో చేపడుతున్న దేశ నిర్మాణం మోదీ నాయకత్వంలో కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రధానికి బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు.. ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 






టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రధాని నరేంద్ర మోదీకి బర్త్ డే విషెస్ చెప్పారు. మోదీకి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని.. దేశ ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీని గతంలో కలిసిన ఫొటోను కూడా చంద్రబాబు ట్వీట్ చేశారు. 






నమో యాప్ ద్వారా శుభాకాంక్షలు


పుట్టినరోజు శుభాకాంక్షల కోసం ఈ సంవత్సరం NaMo యాప్ లో ప్రత్యేక మాడ్యూళ్లను జోడించారు. దీని ద్వారా ప్రజలు పెద్ద సంఖ్యలో పీఎం మోదీకి తమ శుభాకాంక్షలను చెబుతున్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా యాప్ వినియోగదారులు గిఫ్ట్ లేదా సేవను ఎంచుకోవచ్చు. వినియోగదారులు NaMo యాప్‌లో హోస్ట్ చేసిన వర్చువల్ ఎగ్జిబిషన్ నుండి ఎక్కువగా కనెక్ట్ అయ్యే పీఎం మోదీ వితంలోని క్షణాలను కూడా ఎంచుకోగలుగుతారు. యాప్‌ని ఉపయోగించి సోషల్ మీడియాలో షేర్ చేయగల చిన్న వీడియోను రూపొందించగలరు.