CM KCR: నేటి నుంచే హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ- గోల్కొండ కోట నుంచి కేసీఆర్ ప్రకటన  

CM KCR: హైదరాబాద్ లో సర్కారు ఇప్పటి వరకు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించింది. అయితే ఈరోజు నుంచి ఈ ఇండ్ల పంపిణీ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 

Continues below advertisement

CM KCR: రాష్ట్రంలో ఇళ్లు లేకుండా అవస్థలు పడుతున్న అనేక మంది ప్రజలకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ లో నిర్మించిన లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను  అందజేయబోతున్నట్లు ప్రకటించారు. గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో పేద ప్రజలకు ఇచ్చిన ఇండ్ల చాలీచాలకుండా ఉండేవని.. ఆ విషయం గుర్తించే బీఆర్ఎస్ సర్కారు డబుల్ బెడ్రూం ఇళ్ల కట్టిస్తున్నట్లు చెప్పారు. అయితే దీన్ని ఓ నిర్విరామ ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తుందని చెప్పారు.

Continues below advertisement

హైదరాబాద్ మహా నగరంలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం ఈరోజు నుంచే లబ్ధిదారులకు అందజేయనుంది. సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి అనే పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తోంది. ముందుగా ప్రతీ నియోజక వర్గంలో మూడు వేల మందికి ఈ ప్రయోజనం చేకూరుస్తోంది. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి గృహలక్ష్మీ పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించిందని కేసీఆర్ తెలిపారు. 

Continues below advertisement