ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు చెరో క్రొత్త నగరాన్ని నిర్మించే పనిలో ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రి రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్మించే ప్రయత్నం గత ఆరేళ్లు గా చేస్తూనే ఉన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాదును అనుకునే మరో నగరాన్ని సృష్టించడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్న ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు తమ తమ డ్రీం ప్రాజెక్టులను సాకరం చేసే పనిలో పడ్డారు. అయితే ఈ రేసులో ముందు ఉంది ఎవరు అనే విశ్లేషణ ఇప్పడు చూద్దాం.
తెలంగాణ లో తనదైన బ్రాండ్ కోసం రేవంత్ చేస్తున్న ప్రయత్నం -ఫ్యూచర్ సిటీ
రాజకీయంగా తెలంగాణ సీయం రేవంత్ రెడ్డిని ఆయన ప్రత్యర్థులు పదేపదే తెలంగాణ మూవ్ మెంట్ సమయంలో ఆయన పాత్ర పై ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. వాటికి చెక్ పెట్టేందుకు తనదైన బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు ఫ్యూచర్ సిటీ (Future City) పేరుతో మరో కొత్త నగరాన్ని సృష్టించే పనిలో రేవంత్ పడ్డారు. హైదరాబాదును ఆడుకుహైదరాబాదును ఆనుకుని నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ ప్రమోషన్స్ కోసం ఇటీవల ఆయన ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ సమిట్ టాక్ అఫ్ ది స్టేట్ అయింది. ముందుగా ఫ్యూచర్ సిటీ కోసం 30 వేల ఎకరాల్లో దీన్ని నిర్మిస్తుండగా భవిష్యత్ లో దాదాపు లక్షా ఎనభై వేలకు పైగా ఎకరాల్లో విస్తరించే ఆలోచనలో ఉన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో నిర్మిస్తున్న ఈ నగరం ఔటర్ రింగ్ రోడ్, శ్రీశైలం రోడ్డు, నాగర్జున సాగర్ రోడ్ ల మధ్య శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఒక 30 కిమీ దూరం లో రానుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు కు సైబర్ సిటీ, YSR కు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాతలుగా పేరు ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ నిర్మాత గా గా తన పేరు ఉండాలని తెలంగాణ ప్రస్తుత సీయం రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నారు. ఈ సిటీ లో ఫార్మా, AI, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ రంగాలను ప్రోత్సహించేలా 6 థీమ్ సిటీలను నిర్మించే ప్లాన్ చేశారు రేవంత్. ఇప్పటికే ఆ దిశగా పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం.
కనీసం 10 లక్షల మంది నివసించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వానికి పెట్టుబడుల ఆకర్షణ పెద్ద కష్టం కాదు. హైదరాబాద్ పేరుతో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రపంచ స్థాయి సిటీ వారికీ అండగా ఉంది. కేంద్రంపై మరీ ఎక్కువ గా ఆధార పడాల్సిన అవసరం రేవంత్ కు లేదు. ఈ క్రొత్త సిటీ నిర్మాణ పర్యవేక్షణ కు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఆధారిటీ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫ్యూచర్ సిటీ ని తెలంగాణ లోని అన్ని ప్రాంతాలతో డైరెక్ట్ గా కనెక్ట్ చేసే రోడ్లు రెడీ చేస్తున్నారు. అలాగే ఫ్యూచర్ సిటీ ని అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్ట్ తో లింక్ చేసే గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కు కూడా ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. 2028 ఎన్నికల టార్గెట్ గా ఫ్యూచర్ సిటీ తొలి దశ పూర్తి చేసే పనుల్లో సీయం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారు.
చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్ - అమరావతి
ఏపీ రాజధాని నిర్మాత గా తనపేరు నిలబడి పోవాలని సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం అమరావతి. మధ్యలో జగన్ ప్రభుత్వం ఉన్న 5ఏళ్ళు తీసేస్తే ఇప్పటికి అమరావతి పనులు మొదలై 6ఏళ్ళు అయింది. ప్రజల నుండి సేకరించిన 33వేల ఎకరాలకు తోడు మరో 23 వేల ఎకరాల వరకూ (ప్రస్తుతానికి) భూమి ల్యాండ్ పూలింగ్ లో తీసుకుని అక్కడ ప్రపంచ స్థాయి రాజధాని ని 9విభాగాలుగా (నవ నగరాలు ) కట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి CRDA బిల్డింగ్, అసెంబ్లీ, హై కోర్ట్, సచివాలయం (తాత్కాలికం ) మినహామిగిలిన బిల్డింగ్స్ ఏవీ రెడీ కాలేదు. క్వాంటం వ్యాలీ వస్తుంది అని చెబుతున్నా దాని స్వరూపం ఫై స్పష్టత రావాల్సి ఉంది. సమస్య ఏమిటంటే ప్రవేట్ పెట్టుబడులు అమరావతిలో ఇంకా పూర్తిగా కార్యరూరం దాల్చలేదు.
కేంద్రం నుండి కూడా పూర్తి స్థాయిలో అమరావతి కి సాయం అందుతుందా అంటే లేదనే చెప్పాలి. ఇచ్చేదంతా అప్పుగానే ఇస్తున్నారు. పైగా ఏపీ కి రెవెన్యూ పరం గా అండగా నిలబడే హైదరాబాద్ లాంటి నగరం లేదు. అయినప్పటికీ చంద్రబాబు మొండిగా అమరావతి కోసం పోరాడుతున్నారు. ఏదేమైనా 2029 ఎన్నికలకు ముందుగానే అమరావతి కి ఒక రూపం తేవాల్సిన అవసరం పొలిటికల్ గా చంద్రబాబు ఫై ఉంది. ప్రస్తుతానికి అయితే ఒక మేర రేవంత్ ఫ్యూచర్ సిటీ పనులు కాస్త స్పీడ్ గా జరుగుతున్నట్టు కనిపిస్తున్నా చంద్రబాబు కూడా ప్రతికూల పరిస్థితుల్లోనూ తాను అనుకున్నది సాధించి తీరతారని ఆయన అభిమానులు కూటమి నేతలు అంటున్నారు.