KTR News: ఆరోజు అందుకే రాలేకపోయా, లాస్య నందిత ఇంటికి కేటీఆర్ - ఫ్యామిలీకి పరామర్శ

BRS News: లాస్య నందిత ఫోటోకు పూలమాల వేసి కేటీఆర్ నివాళి అర్పించారు. ఎమ్మెల్యే లాస్య తల్లి, సోదరిని ఓదార్చారు.

Continues below advertisement

MLA Lasya Nandita News: రోడ్డు ప్రమాదం కారణంగా అకాల మరణం చెందిన బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఎమ్మెల్యే లాస్య మరణించిన రోజు కేటీఆర్ విదేశాల్లో ఉండడంతో అదే రోజు వచ్చేందుకు వీలు పడలేదు. దాంతో నేడు (ఫిబ్రవరి 25) కేటీఆర్ లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆదివారం ఉదయం మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, మల్లారెడ్డితో కలిసి కార్ఖానాలోని ఆమె నివాసానికి కేటీఆర్ వెళ్లారు. 

Continues below advertisement

లాస్య నందిత ఫోటోకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే లాస్య తల్లి, సోదరిని ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించారన్న వార్త విని షాక్‌కు గురయ్యానని అన్నారు. విదేశాల్లో ఉండటం వల్ల ఆమె అంత్యక్రియలకు రాలేకపోయానని తెలిపారు. లాస్య నందితను గత 10 రోజులుగా అనేక ప్రమాదాలు వెంటాడాయని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఏడాది క్రితమే ఆమె తండ్రి సాయన్న మరణించారని.. ఇప్పుడు మరో పెను విషాదం చోటు చేసుకోవడం దారుణమని అన్నారు. లాస్య నందిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ భరోసా కల్పించారు.

-

Continues below advertisement