KTR Shocking Comments On PM Modi Over HCU Land Issue: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో BRS దూకుడు పెంచింది. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా అడుగులు వేస్తోంది. రీసెంట్ ప్రెస్ మీట్ లో కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ డిమాండ్ చేసిన KTR లేటెస్ట్ గా ప్రధాని మోదీని ట్యాగ్ చేస్తూ కీలక ట్విట్ చేశారు. HCU భూవివాదంలో కలుగ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణంపై ప్రధానిగా తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం ఇది అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టి కాంగ్రెస్, BJP కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలిలో జరిగిన విధ్వంసం విషయంలో తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉండని అభిప్రాయం వ్యక్తం చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసం పైన ప్రధాని మాట్లాడింది కేవలం బూటకం కాకుంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. KTR ఇంకా ఏమన్నారంటే...."కంచ గచ్చిబౌలి అంశం కేవలం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసం మాత్రమే కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 10వేలకోట్ల ఆర్థిక మోసం. ఇప్పటికే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సిబిఐ ఆర్బిఐ సెబి, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ సంస్థలకు ఆధారాలతో సహా కాంగ్రెస్ చేసిన పదివేల కోట్ల ఆర్థిక మోసం గురించి తెలియజేశాం. సుప్రీంకోర్టు పంపించిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కూడా ఈ అంశంలో ఆర్థిక అవకతవకలు జరిగిన అంశాన్ని నిర్ధారించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల విభాగాల స్వతంత్ర విచారణ చేయాలని సూచించింది. నగరాలు వేగంగా విస్తరిస్తున్న ఈ తరుణంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం...అయితే నిస్సిగ్గుగా , అక్రమంగా వ్యవస్థలను మోసం చేసి పర్యావరణాన్ని విధ్వంసం చేసిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్.
ఈ అంశంలో BJP ఎంపీ ఒకరు కూడా పాలుపంచుకున్నారని ఆ పేరును త్వరలోనే బయటపెడతామని కేటీఆర్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు స్పందించకపోతే బీజేపీ చిత్తశుద్ధి లేదని ప్రజలు భావిస్తారని అన్నారు కేటీఆర్. ఈ అంశంపై BRS న్యాయపోరాటం కొనసాగిస్తుందని అవసరం అయితే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన తమకు లేదన్న కేటీఆర్..అవసరం అయితే ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలే ఆగ్రహంగా ఉన్నారంటూ..BRS ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమేనన్నారు. అవసరం అయితే ప్రజలు చందాలు ఇచ్చి మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతారు..కానీ రేవంత్ రెడ్డి ఐదేళ్లపాటూ సీఎంగా ఉండాలని తాను కోరుకుంటున్నా అన్నారు. అలా అయితేనే ఇంకో 20 ఏళ్ల వరకూ ప్రజలెవ్వరూ కాంగ్రెస్ వైపు చూడకుండా,ఓటేయకుండా ఉంటారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచనే తమకు లేదన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ కి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా గ్రామాల్లోకి వస్తే జనం అభిప్రాయం ఏంటో అర్థమవుతుందన్నారు. కొందరు పోలీసులు రేవంత్ రెడ్డి సైన్యంలా పనిచేస్తున్నారని ఆరోపించిన కేటీఆర్..ఇష్టానుసారం కేసులు నమోదు చేస్తే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. రీ ట్వీట్ చేసినా కూడా కేసులు పెట్టడం దుర్మార్గం కాక మరేంటని క్వశ్చన్ చేశారు. పోలీసులు తమ బాధ్యతలు మరిచి రేవంత్ రెడ్డి సైన్యంలా పనిచేస్తే ఊచలు లెక్కెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు కేటీఆర్.
తెలంగాలో ఉన్న వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు,బిల్డర్లు...రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారని..ప్రభుత్వాన్ని కూల్చేయాలంటూ తమకు సలహాలు ఇస్తున్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు గట్టిగానే కౌంటర్ ఇవ్వడంతో ప్రభాకర్ మాట మార్చారు..ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన తమకు లేదన్నారు.