నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం బండ్ల గణేశ్ ప్రయత్నాలు ప్రారంభించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక టికెట్‌ను బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని హస్తం పార్టీ భావిస్తోంది. అధిష్ఠానం ఆయన పేరును కూకట్‌పల్లికి పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు.
క్లారిటీ ఇచ్చిన బండ్ల
ఎన్నికల్లో పోటీపై బండ్ల గణేష్ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదని ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు అవకాశం ఇస్తామని చెప్పారని, ఈసారి టికెట్ వద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యమన్న ఆయన, అందుకోసం కోసం పనిచేస్తానన్నారు. తాను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదని, ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయమన్నారు. తప్పకుండా అధికారంలోకి వస్తుందని, రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని ట్వీట్ చేశారు.