Hyderabad largest Ambedkar statue: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున  ఠీవీూగా నిల్చొని ప్రపంచానికి విలువైన సందేశాన్ని ఇవ్వబోతోంది. ఘనంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. రోజుకు 425 మంది శ్రామికుల రాత్రి పగల కష్టం, ప్రభుత్వం ప్రణాళిక, మరెంతో మంది మేధస్సే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం 


ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ విగ్రహం ఆవిష్కరణరు రెడీ అయింది. విగ్రహం ఎత్తు125 అడుగులుంటే, 11.34 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటైంది. విగ్రహం కోసం 353 టన్నుల స్టీల్ వాడారు. 112 టన్నుల ఇత్తడిని వినియోగించారు. 


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ సమున్నత శిఖరం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున కొలువు దీరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్మృతివనం పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ట్యాంక్ బండ్‌ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు. మొత్తంగా రూ.146.50 కోట్లతో రూపొందించిన ఈ ప్రాజెక్టు 021 జూన్‌ 3న పురుడు పోసుకుంది. నిర్దేశిత గడువు 2023 ఏప్రిల్‌ 30 కంటే ముందుగానే పనులు పూర్తి అయ్యాయి. 


ఈ ప్రాజెక్టును నొయిడాకు చెందిన సంస్థ డిజైన్ చేసింది. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ బాధ్యతను భుజానకెత్తుకుంది. పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత రాం వన్‌జీ సుతార్‌, ఆయన కుమారుడు అనిల్‌ సుతార్‌ ఈ విగ్రహాలను తీర్చిదిద్దారు. ముందు స్టీల్‌లో విగ్రహాన్ని తయారు చేసి తర్వాత దానిపై ఇత్తడి పూతను పూశారు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు మెరిసేలా పాలీయురేతీన్‌ కోటింగ్‌ ఇచ్చారు. 
ప్రధాన విగ్రహంతోపాటు అక్కడ నిర్మిస్తున్న రాక్‌ గార్డెన్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌, ప్లాంటేషన్‌, మెయిన్‌ ఎంట్రన్స్‌, వాటర్‌ ఫౌంటెయిన్‌, సాండ్‌ స్టోన్‌ వర్క్స్‌, జీఆర్సీ, గ్రానైట్‌ ఫ్లోరింగ్‌, లిఫ్ట్‌, విగ్రహం వద్దకు చేరుకొనే మెట్లదారి, ర్యాంప్‌, బిల్డింగ్‌ లోపల ఆడియో విజువల్‌ రూమ్‌, ఫాల్స్‌ సీలింగ్‌ అన్నీ ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేశారు. 


ఎత్తైన అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఓ స్మారక భవనాన్ని కూడా ప్రభుత్వం నిర్మించింది. ఇది భారత్ పార్లమెంట్ భవనాన్ని పోలి ఉంటుంది. 2,476 చదరపు అడుగుల విస్తీర్ణంలో గుండ్రగా, భారీ పిల్లర్లతో నిర్మించారు. ఆకృతిలోనే కాకుండా నిర్మాణంలో కూడా పార్లమెంట్‌ అదే టెక్నిక్ వాడారు. రాజస్తాన్ నుంచి తీసుకొచ్చిన ధోల్‌పూర్‌ లేతగోధుమ, ఎరుపు రంగు ఇసుక రాళ్లు ఇక్కడ ఆకట్టుకోనున్నాయి. 
అంబేడ్కర్ స్మృతి వనం 2.93 ఎకరాల్లో తీర్చిదిద్దారు. దీన్ని మూడంతస్తుల్లో నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో టాయిలెట్స్‌, ఏసీ ఔట్‌డోర్‌ యూనిట్స్‌, స్టోర్‌ రూమ్స్‌ ఉంటాయి. ఆపై ఫ్లోర్‌లో కాన్ఫరెన్స్ హాల్‌, మ్యూజియం, గ్రంథాలయం, ఆడియో వీడియో హాల్ కనిపిస్తాయి. అదే అంబేడ్కర్‌ జీవిత విశేషాలతో ఫొటో గ్యాలరీ ఉంటుంది. ఆ పై అంతస్తులో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన పీఠం ఉంటుంది. 


లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌ 2,066 చదరపు అజడుగులు ఉంటుంది. ఆపై ఉన్న గ్రౌండ్‌ ఫ్లోర్‌ 15,200 చదరపు అడుగులు, ఫస్ట్‌ ఫ్లోర్‌, టెర్రస్‌ 2,200 చదరపు అడుగులు ఉంటుంది. మొత్తం విస్తీర్ణం 19,466 చదరపు అడుగులు ఉంటుంది. ల్యాండ్‌స్కేప్‌ ఏరియా విస్తీర్ణం- 2.93 ఎకరాలు ఉంటే పార్కింగ్ ఏరియా 5.23 ఎకరాలు ఉంది. టికెటింగ్‌, మౌలిక వసతుల కోసం 6,792 చదరపు అడుగులు ఉంది.