'షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్' థీమ్‌తో

Continues below advertisement

నేడు హైదరాబాద్‌లో సదరన్ రైజింగ్ సమ్మిట్.. లైవ్ ఎక్కడ చూడాలంటే?

ABP Southern Rising Summit 2026 Hyderabad (Copy Related Text)

Continues below advertisement

ABP Southern Rising Summit: దక్షిణ భారత ఆర్థిక, సాంకేతిక, సాంస్కృతిక, రాజకీయ ప్రగతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఏబీపీ నెట్‌వర్క్ (ABP Network) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'సదరన్ రైజింగ్ సమ్మిట్–2026' నాలుగో ఎడిషన్‌కు సర్వం సిద్ధమైంది. నవంబర్ 20న హైదరాబాద్ లో ఈ సదస్సును 'షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్' అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. తమిళనాడులో రాజకీయ స్టార్టప్ విజయం సాధించడం నుంచి, తెలంగాణ పెట్టుబడులు, ఆవిష్కరణల గమ్యస్థానంగా ఎదగడం వరకు దక్షిణాది సరికొత్త అవకాశాలకు వేదికగా మారింది. ఐటీ స్టార్టప్‌లలో బెంగళూరు, లైఫ్ సైన్సెస్, వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ ప్రపంచ కేంద్రాలుగా నిలవగా, కర్నూలు 'డ్రోన్ సిటీ'గా గుర్తింపు పొందింది. దక్షిణాది రాష్ట్రాలు సాంకేతికత, అంతరిక్ష రంగం, సామాజిక సంస్కరణలు, వ్యవస్థాపకత ద్వారా దేశాభివృద్ధిలో పోషిస్తున్న కీలక పాత్రపై ఈ వేదికగా విశ్లేషణలు జరగనున్నాయి.

ఉదయం 10:40 గంటలకు సరస్వతీ వందనం, జ్యోతి ప్రజ్వలన, ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో సుమంత దత్తా స్వాగతోపన్యాసంతో ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఇందులో దక్షిణాది ఆవిష్కరణలు, స్టార్టప్ ఎకోసిస్టమ్, కృత్రిమ మేధ, ఆరోగ్య రంగం మరియు సమకాలీన రాజకీయ సమీకరణాలపై విస్తృతంగా మేధోమథనం జరగనుంది. ముఖ్యంగా రాజకీయ దిగ్గజాల ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఉదయం 11:00 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ‘లాస్ట్ మైల్ గవర్నెన్స్ – మేకింగ్ తెలంగాణ ఫ్యూచర్ రెడీ’ అనే అంశంపై ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:05 గంటలకు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ 'ది మైనారిటీ రిపోర్ట్', 3:05 గంటలకు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు 'ఫ్లయింగ్ ఇన్‌టు టర్బులెన్స్', 3:35 గంటలకు ఎంపీ రేణుకా చౌదరి ‘ది ఉమెన్ ఓట్’ అంశాలపై ప్రసంగిస్తారు. సాయంత్రం 4:25 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'లైఫ్ అవుట్ ఆఫ్ పవర్ – రోడ్ బ్యాక్ టు పవర్' అనే అంశంపై, 5:30 గంటలకు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్యం ఠాగూర్ ‘ది సదరన్ ఫ్రంట్’పై ప్రసంగించనుండగా, ఏపీ మంత్రి టి.జి. భరత్, తమిళనాడు మంత్రి వన్ని అరసు తదితర నేతలు దక్షిణాది అభివృద్ధిపై తమ దృక్పథాన్ని పంచుకోనున్నారు.

రాజకీయాలతో పాటు వైద్య, పారిశ్రామిక, విద్యా, సాంకేతిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నారు. అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్-చైర్‌పర్సన్ శోభనా కామినేని, అరకు కాఫీ సహ-వ్యవస్థాపకుడు మనోజ్ కుమార్, ప్రణవ్ వేంపటి, ధీమంత్ నాగరాజ్, పియానిస్ట్ అనిల్ శ్రీనివాసన్ సహా పలువురు ప్రముఖులు కీలక చర్చాగోష్ఠుల్లో పాల్గొంటారు. సాయంత్రం 6:30 గంటల తర్వాత సినీ తార మృణాల్ ఠాకూర్ తమ సినీ ప్రయాణం, దక్షిణాది–ఉత్తరాది సినిమాల అనుబంధంపై ముచ్చటించనున్నారు.

గత మూడు ఎడిషన్ల (2023 చెన్నై, 2024 హైదరాబాద్, 2025) విజయవంతమైన ప్రస్థానం తర్వాతే ఈ నాలుగో ఎడిషన్ జరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:40 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు జరిగే ఈ పూర్తి కార్యక్రమాన్ని ఏబీపీ దేశం (ABP Desam) యూట్యూబ్, ఫేస్‌బుక్, ఎక్స్ ఖాతాలతో పాటు telugu.abplive.com వెబ్‌సైట్, ఏబీపీ లైవ్ యాప్ మరియు ఏబీపీ నెట్‌వర్క్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.