Telangana Crime News: ఇంట్లో చీమలు, బొద్దింకలు, బల్లలు సతాయింపుడు మామూలుగా ఉండదు. కొన్నిసార్లు చాలా కోపం వస్తుంది. అలాంటి వాటితోనే భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పటాన్‌చెరులో జరిగిన ఘటన విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. అంతే కాకుండా ఆమె రాసిన లెటర్ గురించి తెలిసి అయ్యో పాపం అంటూ విచారం వ్యక్చం చేస్తున్నారు.  బల్లులు, బొద్దింకలకు భయపడే వాళ్లను మీరు నిత్యం చూస్తూనే ఉంటారు. కానీ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని అమీన్‌పూర్‌లో ఉండే మనీషాకు చీమలంటే భయం. భర్త శ్రీకాంత్, నాలుగేళ్ల కుమార్తెతో కలిసి శర్వాహోమ్స్‌లో ఉంటున్నారు. మనీషాకు చీమలంటే చచ్చేంత భయం. ఇది మానసిక వ్యాధిలా మారింది. ఇది మరీ ఎక్కువగా ఉండటంతో వైద్యులకు కూడా చూపించారు. వారి కొన్ని సలహాలు ఇచ్చారు. 

Continues below advertisement

ఇంటిలో ఉన్న చీమలకు భయపడుతూ, బయట వారి హేళనను తీసుకోలేక మనీషా తీవ్కమైన తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. భర్త ఆఫీస్‌కు వెళ్లిపోయిన తర్వాత బెడ్‌రూమ్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చీమలకు భయపడుతూ బతకడం తన వల్ల కాదని, చనిపోతున్నట్టు అందులో పేర్కొంది. చిన్నారి జాగ్రత్త అంటూ భర్తకు జాగ్రత్తలు చెబుతూ లెటర్ రాసింది. 

సాయంత్రం ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చిన భర్త బెడ్‌రూమ్ తలుపు మూసి ఉంది. లోపలికి వెళ్లి చూస్తే ఫ్యాన్‌కు మనీషా ఉరివేసుకొని కనిపించింది. షాక్ అయిన శ్రీకాంత్ వెంటనే చుట్టుపక్కల వారిని పిలిచాడు. 

Continues below advertisement

స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. స్పాట్‌కు వచ్చిన పటాన్ చెరు పోలీసులు లెటర్ స్వాధీనం చేసుకున్నారు. వెంటనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.