Hyderabad MMTS Trains : హైదరాబాద్ వాసులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలో వివిధ మార్గాల్లో ప్రయాణించే ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల కరోనా, మరమ్మతుల కారణంగా కొన్ని మార్గాల్లో రైళ్లు నిలిపివేశారు. తాజాగా ఈ మార్గాల్లో రైళ్ల సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మొత్తం 7 రైళ్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. తిరిగి పునరుద్ధరించిన రైళ్లు ఏప్రిల్ 11 వ తేదీ నుంచి తిరగనున్నాయి. కరోనా కారణంగా చాలా రోజుల పాటు ఎంఎంటీఎస్ సేవలు నిలిచిపోయాయి. కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని రైళ్ల సంఖ్యను పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో నగరంలోని పలు మార్గాల్లో ఏడు రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.
కొత్తగా 7 ఎంఎంటీఎస్ రైళ్లు
- ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే రైలు నం. 47156 ఉదయం గం.11.15 లకు బయలుదేరి మధ్యాహ్నం గం.12.45 లకు చేరుతుంది.
- ఫలక్‌నుమా నుంచి రామచంద్రాపురం వెళ్లే టైన్ నం. 47218 రాత్రి గం.21.05లకు బయలుదేరి 23.05 గంటలకు చేరుతుంది.
- రామచంద్రపురం నుంచి ఫలక్‌నుమా వెళ్లే టైన్ నం. 47177 ఉదయం గం.9.10లకు బయలు దేరి 11.05 గంటలకు గమ్యానికి చేరుతుంది.
- లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే టైన్ నం.47185 మధ్యాహ్నం గం.2.55లకు బయలు దేరి, సాయంత్రం గం.04.25 గంటలకు గమ్యానికి చేరుతుంది.
- లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే టైన్ నం. 47217 రాత్రి గం.7.10లకు బయలు దేరి రాత్రి 08.55 గంటలకు గమ్యానికి చేరుతుంది.
- హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే రైలు నం. 47119 సాయంత్రం గం.6.05లకు బయలు దేరి సాయంత్రం 06.50 గంటలకి గమ్యానికి చేరుతుంది.
- ఫలక్‌నుమా నుంచి హైదరాబాద్ వెళ్లే ఎంఎంటీఎస్ రైలు 47201 సాయంత్రం 04.35 గంటలకు బయలు దేరి 05.50 గంటలకు గమ్యానికి చేరుతుంది.