Fact Check : హైదరాబాద్ షేక్ పేట్ ఫ్లై ఓవర్ పై వరుసగా ద్విచక్ర వాహదారులు జారిపడుతున్న వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అయితే నిజంగా అది షేక్ పేట్ ఫ్లై ఓవరా లేదా అనే ఫాక్ట్ చెక్ చేసింది ఏబీపీ దేశం. అయితే ఈ వీడియో హైదరాబాద్ నగరానికే సంబంధించినది కాదని తేలింది. ఇది పాకిస్తాన్ కరాచీలోని ఓ ఫ్లై ఓవర్ పై బైక్స్ స్లిప్ అవుతున్న వీడియో. దీనిని కొందరు షేక్ పేట్ ఫ్లై ఓవర్ అని టాగ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇటీవల ఈ వీడియో మహారాష్ట్రలోని ఓ ఫ్లై ఓవర్ పై జారిపడిపోతున్న వాహనదారులు అని వైరల్ అయింది.
ఇటీవల వైరల్
ఈ వీడియోను నిశితంగా పరిశీలిస్తే ఇందులో ఫ్లై ఓవర్ పక్కన హోండా డ్రైవ్ ఇన్ అని ఉంది. దీనిని సెర్చ్ చేస్తే ఇది పాకిస్తాన్ లోని కరాచీలో ఉన్నట్లు తేలింది. అలాగే ఫ్లై ఓవర్ పక్కన ఉన్న ఓ హోటల్ ముందు జెండా గమనిస్తే అది పాకిస్తాన్ జెండాను పోలి ఉంది. ఈ వీడియో ఇటీవల భారత్ లోని పలు రాష్ట్రాల్లో వైరల్ అయింది. తాజాగా హైదరాబాద్ లోని ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై ఏబీపీ దేశం ఫాక్ట్ చెక్ చేస్తే అసలు విషయం తెలిసింది.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అదే విధంగా రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తూర్పు పశ్చిమ ద్రోణి మధ్యప్రదేశ్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. అంతర్గత ఒడిశా, దాని పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా, దాని పరిసరాలలో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వాతావరణశాఖ తెలిపింది.