RRB NTPC Special Trains : ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉద్యోగార్థులకు కోసం దక్షిమ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం 65 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి నడిచే ప్రత్యేక రైళ్ల జాబితాను దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేశారు. ఏయే మార్గాల్లో రైళ్లు నడుస్తాయో, బయల్దేరే వేళలు, ఏయే స్టేషన్లలో ఆగుతాయి వంటి వివరాలను జాబితాలో పేర్కొన్నారు.






రాయితీలు లేవు


అయితే ప్రత్యేక రైళ్లకు రుసుము చెల్లించాలని, ఎలాంటి రాయితీలు ఉండవవని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌- మైసూర్‌, సికింద్రాబాద్‌- విశాఖ, జబల్పూర్‌- నాందేడ్‌, గుంటూరు- నాగర్‌సోల్‌, హతియా-చీరాల, నాగ్‌పూర్‌-సికింద్రాబాద్‌, కాకినాడ టౌన్- మైసూర్‌, కాకినాడ పట్టణం- కర్నూలు నగరం, ఆదిలాబాద్‌- చెన్నై సెంట్రల్‌, హుబ్బళి- ఔరంగాబాద్‌, డోన్‌- విజయవాడ, మచిలీపట్నం- ఎర్నాకుళం, కడప- విశాఖ, చీరాల-షాలిమార్‌ , హటియా-విజయవాడ, నర్సాపురం-త్రివేండ్రం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఎన్టీపీసీ ఉద్యోగార్థుల కోసం నడిపే 65 ప్రత్యేక రైళ్లలో ఎలాంటి రాయితీలు ఉండవని, ప్రత్యేక రైళ్ల రుసుమును చెల్లించాలని అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఎక్కువ రైళ్లు అందుబాటులో ఉండనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.