Hyderabad Rains : హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈదురు గాలులతో వర్షం కురిసింది. దీంతో పాటు నగరంలోని మాదాపూర్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, లంగర్ హౌస్, కార్వాన్, గోల్కొండ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, కవాడిగూడ, విద్యానగర్, బోలక్‌పూర్, గాంధీనగర్‌ ప్రాంతాల్లో మోస్తరు వాన కురిసింది. సికింద్రాబాద్, మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది. బీఆర్కే భవన్‌, ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, బేగంబజార్, ఏంజె మార్కెట్, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, హిమాయత్ నగర్, నారాయణగూడ, లిబర్టీ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. నగరంలో ఈదురుగాలులతో వర్షం కురవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. భానుడి ఉక్కపోతతో అల్లాడిపోతున్న నగరవాసులకు వర్షంతో కాస్త ఉపశమనం కలిగింది. 






తేలికపాటి నుంచి మోస్తరు వర్షం 


హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయిందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. నగరంలో గరిష్టంగా 40 డిగ్రీలు, కనిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపింది. పశ్చిమదిశ ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 10-14 కి.మీ వేగంగా వీస్తాయని తెలిపింది. 


ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 


ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అకాల వర్షం కారణంగా వరి తడిసిముద్దైంది. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది. వరి కోతలు, ధాన్యం ఆరబెడుతున్న సమయంలో అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.  సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులకు చెట్టు కూలి నాలుగు ద్విచక్ర వాహనాలపై పడింది. అకాల వర్షంతో పట్టణవాసులకు కాస్త ఉపశమనం ఉంటే రైతులకు మాత్రం కష్టాలు తెచ్చిపెట్టింది. 






వడగండ్ల వాన 


హైద‌రాబాద్‌లోని ఉప్పల్, అంబ‌ర్‌పేట‌, ఉస్మానియా యూనివ‌ర్సిటీ, రాంన‌గ‌ర్‌, ముసారాంబాగ్, మ‌ల‌క్‌పేట్‌, రామంతాపూర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, రాజేంద్రన‌గ‌ర్, శంషాబాద్, శివ‌రాంప‌ల్లి, బంజారాహిల్స్, మాసాబ్ ట్యాంక్, జూబ్లీహిల్స్, మెహిదీప‌ట్నం, అత్తాపూర్, ఖైర‌తాబాద్ ప్రాంతాల్లో తేలిక‌పాటి వ‌ర్షం కురిసింది. పలు పాంత్రాల్లో వడగండ్ల వాన కురిసింది. సంగారెడ్డి, మెద‌క్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో రాబోయే గంట‌లో పిడుగులు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది.