Hyderabad News : హైదరాబాద్ లో బుధవారం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు చెరువులను తలపించాయి. వాహనదారులు, స్థానికులు వర్షానికి చాలా ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ లో పరిస్థితులపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ లక్ష్యంగా నెటిజన్లు రెచ్చిపోయారు. విశ్వనగరం ఇదేనా అంటూ నీటమునిగిన రోడ్లపై బోటులో వెళ్తోన్న వీడియో, పార్క్ చేసిన బైక్ లు నీట మునిగిన వీడియోలు, ఫొటోలతో వరుసగా ట్విట్ల వర్షం కురిపించారు. వర్షం వెలిసిన తర్వాత జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. నివారణ చర్యలు చేపట్టింది. రోడ్లు, డ్రైనేజిలు మరమ్మతులు చేస్తుంది. దీంతో పాటు ట్విట్టర్లోన్ రివర్స్ ఎటాక్ మొదలు పెట్టింది. వర్షాల ప్రభావంతో నీట మునిగిన ప్రాంతాల్లో పరిస్థితిని చక్కదిద్దామని ఫొటోలు పెడుతోంది జీహెచ్ఎంసీ. వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నామని, ఇదిగో చూడండి అంటూ బిఫోర్, ఆఫ్టర్ అంటూ ఫొటోలు పోస్ట్ చేసింది.






ఏదో ఒకటి రెండు ప్రాంతాల్లో కాకుండా హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడ వర్షం వల్ల సమస్యలు ఎదురయ్యాయో అక్కడ పరిస్థితి చక్కదిద్దామని నెటిజన్లకు తమ పనితనం ఏంటో చూపించారు జీహెచ్ఎంసీ ఉద్యోగులు. 


అన్నపూర్ణ కాలనీలో వర్షం నిండిన సిమెంట్ రోడ్డు, ఆ తరువాత నీటిని తొలిగించిన తరువాత రహదారి



సైనిక్ పురి, నిర్మల్ నగర్ లో భారీగా రోడ్లపై చేరిన వరద నీరు, ఆ తరువాత నీటిని క్లియర్ చేసిన ఫొటోలు 


ఫ్లైఓవర్ వద్ద వర్షపునీటిలో చిక్కుకున్న కారు, ఆ తరువాత వర్షపు నీటిని క్లియర్ చేసిన ఫొటో 


ఓల్డ్ మలక్ పేటలో వరదనీటితో నిండిన కాలనీ, ఆ తరువాత నీటిని క్లియర్ చేసిన ఫొటోలు 


గగన్ ఫహడ్ రైల్వే బ్రిడ్జిపై వరదనీరు, నీరు తొలగించిన తర్వాత పరిస్థితిని తెలియజేస్తున్న ఫొటో


నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లకు అడ్డంగా విరిగిన వృక్షాలను తొలిగించిన వీడియోలను జీహెచ్ఎంసీ పోస్ట్ చేసింది. అనేక చోట్ల నగరంలో సాధారణ పరిస్థితి తెచ్చేందుకు జీహెచ్ ఎంసీ సిబ్బంది పడిన కష్టాలు తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ వినూత్నంగా స్పందించింది. సమస్య ఎక్కడ మొదలైయ్యిందో పరిష్కారం అక్కడే కనిపెట్టాలి. ప్రశ్న ఎక్కడ ఎదురైయ్యిందో.. సమాధానం అక్కడే ఇవ్వాలి అనుకున్నారేమో జీహెచ్ఎంసీ అధికారులు ట్విట్టర్ వేదికగా నగరంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో యధాతథ పరిస్థితి తెచ్చేందుకు పడ్డ కష్టాలు కళ్లకు కట్టినట్టు చూపించారు. జీహెచ్ఎంసీ స్పందించిన తీరుకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా వేదికగా జీహెచ్ఎంసీ సిబ్బందిపై ప్రసంశల జల్లు కురుస్తోంది.