NTR Daughter Suicide : ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమామహేశ్వరి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కంఠమనేని ఉమామహేశ్వరి ఎన్టీఆర్ నాల్గో కుమార్తె. దీంతో ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఉమామహేశ్వరి ఇంటికి చేరుకుంటున్నారు. నారా లోకేశ్ ఇప్పటికే ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. ఇటీవలే కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తె వివాహం జరిగింది. విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఆరోగ్య సమస్యలే కారణమా?
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంత కాలంగా ఉమామహేశ్వరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆమె సోమవారం సూసైడ్ చేసుకున్నారు. ఆమె మృతితో ఎన్టీఆర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఉమామహేశ్వరి ఇంటికి ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబసభ్యులు చేరుకున్నారు.
ఎల్లుండి అంత్యక్రియలు!
ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తల్లి మరణంపై కుమార్తె దీక్షిత పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు డయల్ 100కి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు మధ్యాహ్నం 2.45 గంటలకు ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. ఉమామహేశ్వరి మరణం ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పెద్ద కుమార్తె విశాల అమెరికా నుంచి రావాల్సిఉంది. ఉమామహేశ్వరి అంత్యక్రియలు బుధవారం నిర్వహించే అవకాశం ఉంది. ఆమె మరణ వార్త తెలియగానే నందమూరి బాలకృష్ణ, రామకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి వచ్చారు. పోస్టుమార్టం కోసం ఉమామహేశ్వరి భౌతికకాయాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భౌతికకాయం వెంట బాలకృష్ణ, రామకృష్ణ, నారా లోకేశ్ సహా మరికొందరు కుటుంబసభ్యులు ఆసుపత్రికి వెళ్లారు.
ఎన్టీఆర్ చిన్న కూతురు
మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం ఉన్నారు. వీరిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. ఎన్టీఆర్ కు జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఉమామహేశ్వరి గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తెకు వివాహం అయింది.
Also Read : Loan Apps News: నందిగామ యువతి సూసైడ్ అసలు కారణం ఇదే, తేల్చిన పోలీసులు
Also Read : Buggana Rajendranath: మంత్రి బుగ్గన ముఖంపైనే దురుసుగా మాట్లాడిన మహిళ! సొంతూర్లోనే, వీడియో వైరల్