Shilpa Flyover : సైబరాబాద్ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్‌ను తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. గచ్చిబౌలి జంక్షన్‌లో 300 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దీని సాయంతో ఔటర్ రింగ్ రోడ్ నుంచి సిటీలోకి ఎంట్రీ అవడం సులభం అవుతుంది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి మీదుగా పటాన్‌చెరు, కోకాపేట్, నార్సింగ్‌తో పాటు, శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టుకు ఈజీగా వెళ్లే వీలు కలుగుతుంది. అయితే గడచిన ఆరేళ్లలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా జీహెచ్‌ఎంసీ పూర్తిచేసిన 17వ ప్రాజెక్టు ఇది. ఫ్లై ఓవర్ పొడవు 2వేల 810 మీటర్లు ఉంది. నాలుగు లేన్లు.. రెండువైపులా ప్రయాణించవచ్చు.
31 ప్రాజెక్టులు కంప్లీట్
ఈ ఫ్లైఓవర్ తో గచ్చిబౌలి జంక్షన్‌లో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. హెచ్‌కేసీ పరిసరాల్లోని ఐటీ కంపెనీలకు ఈ ఫ్లై ఓవర్‌తో ఎంతో సదుపాయం కలగనుంది. మరీ ముఖ్యంగా హైటెక్ సిటీ, హెచ్‌కేసీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల మధ్య మంచి కనెక్టివిటీతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుకు, ఔటర్ రింగ్‌రోడ్డుకు కూడా ఇది మంచి కనెక్టివిటీ అని అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో మెరుగైన రవాణాయే లక్ష్యంగా ఫ్లైఓవర్లు నిర్మిస్తున్న జీహెచ్‌ఎమ్‌సీ.. SRDP కింద మొత్తం 47 పనులు చేపట్టింది. ఇప్పటివరకు 31 ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి. మరో 16 పనులు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. కంప్లీటైన 31 పనుల్లో ఆల్రెడీ 15 ఫ్లైఓవర్లు అందుబాటులోకొచ్చాయి. సిటీలోకి ఎంటరవ్వాలంటే ఎక్కువమందికి ఇదే కీలక మార్గం. ఫ్లైఓవర్ల పరంపర ఇక్కడితోనే ఆగిపోలేదు. మాదాపూర్, గచ్చిబౌలిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు త్వరలో మరో రెండు ఫ్లైఓవర్లు రాబోతున్నాయి. ఒకటి కొత్తగూడ ఫ్లైఓవర్, మరొకటి శిల్పా లేఅవుట్ బ్రిడ్జ్. ఈ రెండింటి పనులు పూర్తికావొస్తున్నాయి. వీటిని కూడా డిసెంబర్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు.
ట్రాఫిక్ కష్టాలకు చెక్
కొత్త ఫ్లైఓవర్‌కు సంబంధించిన వీడియోను మంత్రి కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఔటర్ నుంచి శిల్పా లే ఔట్ వరకు అప్ అండ్ డౌన్ ర్యాంపులను నిర్మించారు. ఓ.ఆర్.ఆర్ నుంచి గతంలో ఉన్న గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై నుండి శిల్పా లే ఔట్ వరకు అక్కడ నుంచి ఓ.ఆర్.ఆర్ వరకు మరో వైపు రెండు వైపులా కలుపుకుని మొత్తం 956 మీటర్ల పొడవు 16.60 మీటర్ల వెడల్పు గల ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టారు. అప్ ర్యాంపు ఓ.ఆర్.ఆర్ నుంచి శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ వరకు 456.64 మీటర్ల వెడల్పు, శిల్పా లే అవుట్ నుంచి ఓ.ఆర్.ఆర్ వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 399.952 మీటర్ల వెడల్పుతో రెండు ఫ్లైఓవర్లను చేపట్టారు. సర్వీస్ రోడ్డుగా ఉపయోగించే గచ్చిబౌలి నుంచి మైండ్ స్పేస్ వరకు 473 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో అప్ ర్యాంపు ఫ్లైఓవర్ ను చేపట్టారు. అదే విధంగా మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలి వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 522 మీటర్ల పొడవు 8.50 మీటర్ల వెడల్పుతో చేపట్టారు. ఈ ఫ్లైఓవర్ తో గచ్చిబౌలి జంక్షన్ ట్రాఫిక్ కు సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.