Hyderabad Metro Timings Changed: భాగ్యనగర వాసులకు హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) గుడ్ న్యూస్ అందించింది. మెట్రో రైలు టైమింగ్స్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాత్రిపూట ఆలస్యంగా ప్రయాణించే వారికి వెసులుబాటు కలగనుంది. ఇప్పటివరకూ రాత్రి 11 గంటల వరకే చివరి రైలు ఉండగా.. ఇక నుంచి రాత్రి 11:45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనుంది. అలాగే, ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే మెట్రో రాకపోకలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన రోజుల్లో ఎప్పటిలాగానే ఉదయం 6 గంటలకే రైళ్లు ప్రారంభం కానున్నాయి. కాగా, సోమవారం సగటున రోజుకు 4.50 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. పొడిగించిన టైమింగ్స్ శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని మెట్రో అధికారులు తెలిపారు. ఇటీవల పెరిగిన రద్దీ దృష్ట్యా.. నగరవాసుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు టైమింగ్స్ పొడిగించినట్లు తెలుస్తోంది.