Scammer Changed : ఎవరైనా తెలియని వ్యక్తి మీకు రూ.10 వేలు పొరపాటున పంపానని, ఆ డబ్బు తిరిగి చెల్లించాలని మీకు మేసెజ్ పెట్టాడనుకోండి. మీరు ఏంచేస్తారు. ఇది సైబర్ క్రైమ్ అని తెలుసుకుని వాడిని చడామడా తిట్టి ఆ నంబర్ బ్లాక్ చేస్తారు. మళ్లీ మేసెజ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తారు. కానీ ఓ వ్యక్తికి ఇలాంటి మేసెజ్ వచ్చింది. కానీ అతడు చేసిన పనిని చూస్తే మీరు అవాక్కవుతారు. అంతే కాదండోయ్ ఆ వ్యక్తిని మెచ్చుకోకుండా ఉండలేదు. ఇంతకీ అతడు చేసిన పనేంటంటే?
సైబర్ నేరస్థుడిలో పరివర్తన
కొత్త నెంబర్ నుంచి ఓ వ్యక్తికి మేసెజ్ వచ్చింది. అందులో గూగుల్ పేలో మీకు పొరపాటున 10 వేల రూపాయలు బదిలీ చేశాను. ఆ డబ్బు తిరిగి నా అకౌంట్ కు చెల్లించండి అని ఓ గూగుల్ పే అకౌంట్ నంబర్ ఇచ్చాడు. అందుకు అతడు స్పందిస్తూ నాకు ఎలాంటి నగదు రాలేదు. మీరు సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్నారని నాకు తెలుసు. మీరు కేవలం రూ.10 వేలకు ఇలాంటి పనులు చేస్తున్నారా? దీనికి బదులు మీరు గ్రాఫిక్ డిజైన్ కోర్సు నేర్చుకుని అందులో మీ కెరీర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా! అలాగే ఆ కోర్సు చేస్తూ కొత్త సాఫ్ట్ వేర్ నేర్చుకుంటూ ఫ్రీలాన్సర్ గా పనిచేయవచ్చు. ఈ కోర్సుతో మీకు మంచి ఉద్యోగం కూడా వస్తుంది. మీ జీవితానికి అది కొత్త ప్రారంభం అవుతుంది కూడా. ఇలా అతడు మేసెజ్ చేయగానే ఆ సైబర్ నేరస్థుడిలో పరివర్తన వచ్చింది. క్షమించండి సార్ అంటూ రిప్లై ఇచ్చాడు. నేను అసలు కోల్ కత్తాకు చెందిన వ్యక్తిని కాదు. మిమల్ని మోసం చేయాలనుకున్నాను. అంటూ నేను ఆ కోర్సు చేయవచ్చా అని వివరాలు కోరాడు. అందుకు ఆ వ్యక్తి స్పందిస్తూ నవ్వు ఈ కోర్సు ఆన్ లైన్ లేదా క్లాస్ రూమ్, హైబ్రిడ్ క్లాసెస్ లో కూడా పూర్తి చేయవచ్చు అంటూ కోర్సు వివరాలు షేర్ చేశాడు. సరే సర్ నేను రేపటి నుంచి క్లాసెస్ కు వెళ్తాను అంటూ సైబర్ నేరగాడు రిప్లై ఇచ్చాడు.
సైబరాబాద్ పోలీసుల ట్వీట్
మోసం చేయాలని చూసిన ఓ సైబర్ నేరస్థుడిని కూడా తన మాటలతో మార్చేశాడో వ్యక్తి. ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. 'మన దేశంలో ఏదైనా సాధ్యమవుతుంది. అది ఏదైనాదుష్టకార్యం తలంచినా, దుర్భిద్దితో దుష్టుడైన వాడిని, మంచి కార్యం వైపు నడిపించి బుద్దుడై పోయేలా చేయడం అంటే ఇదే.' అంటూ సైబరాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు.