IND Vs AUS T20 : ఈ నెల 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్-ఆసీస్ మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానుల ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని మెట్రో సేవలను ఆదివారం అర్ధరాత్రి వరకు పొడిగించారు. హైదరాబాద్ మెట్రో మెట్రో సర్వీసుల సమయం పొడిగిస్తూ  నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. మ్యాచ్ పూర్తైన తర్వాత అభిమానులు తిరిగి ఇంటికి వెళ్లేలా హైదరాబాద్ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. రద్దీని బట్టి మరిన్ని సర్వీసులు నడుపుతామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.  


మూడేళ్ల తర్వాత మ్యాచ్ 


మూడేళ్ల తర్వాత ఉప్పల్‌లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ జరుగుతుంది. సెప్టెంబర్ 25న భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 15న పేటీఎమ్ ద్వారా ఆన్‌లైన్‌లో మ్యాచ్ టికెట్లు విక్రయించారు. అయితే ఆ టికెట్లు క్షణాల వ్యవధిలో అయిపోయాయి. టికెట్‌లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నప్పటికీ మ్యాచ్ రోజున స్టేడియంలోకి వచ్చేందుకు ఫిజికల్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో ఫిజికల్ టికెట్లను తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.  ఈ ఫిజికల్ టికెట్ల తీసుకున్నప్పుడు జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట జరిగింది. పదుల సంఖ్యలో క్రికెట్ అభిమానులు గాయపడ్డారు. 






 మొబైల్స్, బ్లూటూత్ హెడ్ సెట్ అనుతిస్తాం - సీపీ 


ఎల్లుండి జరిగే మ్యాచ్ కి 2500 పోలీస్ సిబ్బందితో సెక్యురిటీ ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ను వీక్షించేందుకు 40 వేలకు పైగా ప్రేక్షకులు వస్తారన్నారు. ప్లేయర్స్ రేపు సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారని తెలిపారు. ఎల్లుండి ఉదయం ప్రాక్టీస్ కి గ్రౌండ్ కు ప్లేయర్స్ వస్తారని వెల్లడించారు.  ఎల్లుండి అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో ట్రైన్స్ నడుస్తాయని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి ఎక్కువ మెట్రో సర్వీసులు నడుస్తాయన్నారు. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారని పేర్కొన్నారు. 300 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానం చేశామన్నారు. గ్రౌండ్ లో ఉండే ప్రతీ వ్యక్తిని జూమ్ చేసి చూసే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వీటిని బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్స్ కి అనుసంధానం చేస్తామన్నారు. ప్రేక్షకుల మొబైల్స్, బ్లూటూత్ హెడ్ సెట్ లను అనుమతిస్తామన్నారు.  సిగరెట్, కెమెరాలు, షార్ప్ ఆబ్జెక్ట్, ఆల్కహాల్, వాటర్ బాటిల్స్, హెల్మెట్స్, పెట్స్, ఫైర్ క్రాకర్స్, బయటి ఫుడ్, బ్యాగ్స్, సెల్ఫీ స్టిక్స్, డ్రగ్స్ అనుమతించమన్నారు.  






పిక్ పాకెటర్స్ పై ప్రత్యేక దృష్టి 


"షార్ప్ షూటర్స్, ఆక్టోపస్ యూనిట్స్, మోంటెడ్ హార్సెస్ టీమ్స్ అందుబాటులో ఉంచాం. ఎల్లుండి వర్షాలు వచ్చే ఛాన్స్ లేదని వాతావరణ శాఖ తెలిపింది. పిక్ పాకెటర్స్ పై ప్రత్యేక దృష్టి పెడతాం. దొంగలు కూడా టికెట్స్ కొని లోపలికి వచ్చి ఫోన్స్, పర్సులు కొట్టేస్తారు. గ్రౌండ్ లో స్పైడర్ కెమెరా ఉంటుంది. ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్, మెడికల్ టీమ్స్ ఉంటాయి.  7 అంబులెన్స్ లు ప్రేక్షకుల కోసం, 2 అంబులెన్స్ లు ప్లేయర్స్ కోసం ఉంటాయి. గ్రౌండ్ చుట్టుపక్కల పాములు కూడా ఉన్నాయి. కాబట్టి స్నేక్ క్యాచర్స్ ని పెట్టి పాములను పట్టిస్తున్నాం. హైదరాబాద్ కి మరిన్ని మ్యాచ్ రావాలని  పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం. "- సీపీ మహేష్ భగవత్ 


ట్రాఫిక్ సూచనలు