TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మంత్రి వర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో అదనపు నిధుల సమీకరణపై కీలకంగా చర్చిస్తున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకు నిధుల సమీకరణ అనుమతులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని కేంద్రం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అదనపు వనరులను ఎలా సమీకరించాలనే విషయంపై కేబినెట్ చర్చిస్తుంది.
అసెంబ్లీ సమావేశాలపై
వీటితో పాటు వృద్ధాప్య పింఛన్ల వయసు 57 ఏళ్లకు తగ్గింపు, డయాలసిస్ పేషంట్లకు ఆసరా, అనాథ పిల్లల సంరక్షణకు ప్రత్యేక కార్యచరణపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ చర్చిస్తుంది. స్వతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీలను విడుదల చేసే విషయంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకొనున్నారు. ఈ నెల 21న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, మునుగోడు ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది.