Priyanaka Gandhi : అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై ఫోకస్‌ పెట్టారు కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ. AICCకి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులతో త్వరలోనే రాష్ట్రానికి రాబోతున్నారు ప్రియాంక గాంధీ. సీనియర్ నేతలు ఎందరున్నా నానాటికీ పార్టీ మసకబారడం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ స్వయంగా రంగంలోకి దిగాలని కొందరు సీనియర్లు ఇప్పటికే పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. త్వరలోనే ప్రియాంకా గాంధీ హైదరాబాద్‌కు రాబోతుందంటా. ఇందుకు సంబంధించిన ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ కూడా రెడీ అయిన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్‌పై పార్టీ యాంక గాంధీ వాద్రా ఫోకస్ పెట్టిన్నట్లు ఎల్లడించారు. పార్టీ వరుస ఓటముల నుంచి కోలుకునేందుకు పార్టీ ఛీఫ్ వరుస రివ్యూలు చేస్తున్నారు. 


తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం ఫోకస్ 


ఇప్పటి నుంచి ఏం చేయాలి అనే దానిపై తాజాగా కాంగ్రెస్ మరో ఫోకస్ పెట్టింది. ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నారట. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎజెండాగా మలుచుకుని ప్రత్యక్ష పోరాటాలను చేయాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారట. ఇదిలా ఉంటే తాజాగా భారత్‌ జోడో యాత్రలో భాగంగా సోదరుడు రాహుల్‌ గాంధీతో కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ కలిసి నడిశారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో భర్త రాబర్ట్‌ వాద్రా, కుమారుడు రోహిన్‌తో కలిసి రాహుల్‌ పాదయాత్రలో పాల్గొన్నారు. కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ, 26 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నుంచి యాత్ర సాగుతోంది. మనం కలిసి నడిస్తే మన అడుగులు బలంగా ఉంటాయి అని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 


రాహుల్ జోడో యాత్రపై బీజేపీ విమర్శలు 


ప్రియాంకతోపాటు కాంగ్రెస్ నేతలు కమల్‌నాథ్ , సచిన్ పైలట్, దిగ్విజయ్ సింగ్ యాత్రలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 380 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఆ తర్వాత రాజస్థాన్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అన్ని వర్గాల ప్రజలను తన యాత్రలో కలుస్తుండటం తనకు సంతోషంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు తాను ఈ యాత్ర చేపట్టినట్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. రాహుల్‌ గాంధీపై అస్సోం సీఎం హిమంత బిస్వా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. సద్వాం హుస్సేన్‌తో పోలుస్తూ విమర్శలు చేశాడు. రాహుల్‌ గాంధీ నియంత హుస్సేన్‌లా కనిపిస్తున్నాడని అన్నారు. సాధారణంగా రాహుల గాంధీ గుజరాత్‌లో కనిపించారని, విజిటింగ్ ఫ్యాకల్టీలా రాష్ట్రానికి వస్తాడని హిమంతా బిస్వా శర్మ ఆరోపించారు. అంతేకాదు భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు బాలీవుడ్ తారలకు కాంగ్రెస్ పార్టీ డబ్బులిచ్చి ఉంటుందని విమర్శలు గుప్పించారు.