Love Marriage : అమెరికా అమ్మాయికి ఆదిలాబాద్ అబ్బాయికి జోడీ కుదిరింది. ఇద్దరికీ హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా పెళ్లి జరిగింది. హైదరాబాద్ లోని అలంక్రిత రిసార్ట్ లో అంగరంగ వైభవంగా అతిథుల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిగింది. ఆదిలాబాద్ కు చెందిన దేవిదాస్ - కళావతి దంపతుల పెద్ద కుమారుడు అభినయ్ రెడ్డి, అమెరికాకు చెందిన టేలర్ డయానా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లగా పని చేస్తున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు పెళ్లికి హాజరయ్యారు. అమ్మాయి తరఫు బంధువులు హిందూ సంప్రదాయాలను అమితంగా ఇష్టపడుతున్నారు. భారతీయ వంటకాలు, సంస్కృతి పట్ల చాలా ఇష్టంగా ఉన్నారు. కాగా అబ్బాయి తండ్రి పోలీస్ శాఖలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ప్రేమ వివాహం పట్ల ఇరువురి కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి. 



కొత్తగూడెం అబ్బాయి, అమెరికా అమ్మాయి


ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించారు ఒక ప్రేమ జంట. దేశాలు వేరైనా ప్రేమ విశ్వవ్యాప్తం అని చాటారు. ఈ ఏడాది ప్రేమికుల రోజు(Valentine's Day)కు రెండు రోజుల ముందు వివాహం చేసుకున్నారు. తెలంగాణ కొత్తగూడెం జిల్లా(Kothagudem District)కు చెందిన టోనీ సిలాస్ అమెరికాకు చెందిన జెస్సికా ఇద్దరు కొన్నాళ్లుగా ప్రేమించుకున్నారు. ఇరువురు తమ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు చెప్పి పెద్దలను ఒప్పించారు. వీరి ప్రేమను ఒప్పుకున్న కుటుంబ పెద్దలు కొత్తగూడెం సెయింట్ ఆండ్రస్ చర్చిలో CSI బిషప్ పద్మారావు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేశారు. ఈ పెళ్లికి అమెరికా(America) నుంచి అమ్మాయి తల్లిదండ్రులు హాజరయ్యారు.  


హనుమకొండ అబ్బాయి, అమెరికా అమ్మాయి


హనుమకొండ అబ్బాయి, అమెరికా అమ్మాయి ఇరువురు ఇటీవల ప్రేమ వివాహం(Love Marriage) చేసుకున్నారు. హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్‌లో హిందు సంప్రదాయంతో వారి వివాహం జరిగింది. హనుమకొండ(Hanumakonda) సూదుల సువర్ణ-సమ్మిరెడ్డి దంపతుల కుమారుడు బస్వంత్‌రెడ్డి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌(Software Engineer)గా ఉద్యోగం చేస్తున్నారు. అదే కంపెనీలో పని చేస్తున్న అమెరికాకు చెందిన హంఫ్రే బిల్‌రావు-వెరోనిక కుమార్తె ఎలీషాతో బస్వంత్ రెడ్డికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమ(Love)గా మారింది. ఇరువురు తమ ప్రేమ విషయాన్ని కుటుంబ పెద్దలకు తెలపగా, వాళ్లు అంగీకరించారు. దీంతో ఇరు కుటుంబ సభ్యుల మధ్య వారి వివాహం(Marriage) ఘనంగా జరిగింది. 


Also Read : Dandari Festival: ఘనంగా ఆదివాసీల దండారీ సంబురాలు, దేవుళ్లకు ఏం సమర్పిస్తారంటే?