Hyderabad JEE Mains Exam : హైదరాబాద్ అబిడ్స్ లోని జేఈఈ మెయిన్స్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అబిడ్స్ లోని అరోరా ఇంజినీరింగ్ కాలేజ్ లో ఇవాళ మధ్యాహ్నం జరిగాల్సిన పరీక్ష ఇంకా ప్రారంభం కాలేదు. 3 గంటలకు పరీక్ష మొదలవ్వాల్సి ఉన్నా పరీక్ష కేంద్రంలోకి ఇంకా అనుమతించడంలేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు మొదలు కావాల్సిన ఎగ్జామ్ కూడా గం.10. 30 కు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. సర్వర్ డౌన్, టెక్నికల్ ప్రాబ్లెమ్ అని అరోరా కళాశాల సిబ్బంది చెబుతోంది. ఉదయం జరిగిన ఎగ్జామ్ లో 26 ప్రశ్నలు ఒపెన్ కాలేదని విద్యార్థుల ఆరోపిస్తున్నారు. అరోరా కాలేజీలో సరైన సదుపాయాలు లేవని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తక్షణం సరైన పద్ధతిలో ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో హాజరుకానున్న 1.90 లక్షల విద్యార్థులు
దేశవ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ పరీక్షలకు హాజరకానున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్షలు గురువారం ప్రారంభం అయ్యాయి. ఈ నెల 29వ తేదీ వరకూ ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు తెలంగాణ వ్యాప్తంగా 1.90 లక్షల మంది హాజరుకానున్నారు. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) విద్యార్థులకు అడ్మిట్ కార్డులు జారీచేసింది. కోవిడ్ తర్వాత జరుగుతున్న మెయిన్స్ పరీక్షలు కావడంతో ఎన్‌టీఏ పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టింది. రాష్ట్రాల పరిధిలోని వివిధ బోర్డులు ఇంటర్, తత్సమాన స్థాయి పరీక్షల్లో 70% సిలబస్‌ను బోధించాయి. అయితే జేఈఈలో మాత్రం ఈ నిబంధన వర్తించే అవకాశం లేదని ఎన్టీఏ తెలిపింది. ఈ పరీక్షలో 90 ప్రశ్నలకు సమాధానాలు రాయాలనే నిబంధనలో మార్పు చేశారు. 75 ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుందని ఎన్టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్స్ పేపర్ 360 మార్కులకు బదులు 300 మార్కులకే ఉంటుందని తెలుస్తోంది.