Three Days Rains : తెలంగాణ వాసులు మరో మూడు రోజుల వరకూ ముసురులోనే ఉండాలని వాతావరణ కేంద్రం తేల్చేసింది. ఇప్పటికే ఐదు రోజులుగా చినుకులు పడుతూనే ఉన్నాయి. మరో రోజుల వరకూ తెరిపినిచ్చే చాన్స్ లేదని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి దక్షిణ ఒరిస్సా తీరము పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని దాని వల్ల తెలంగాణపై ప్రబావం అధికంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ రోడ్లపై ప్రయాణిస్తున్నారా, వర్షం నీళ్లు నిలిచిపోయే ఏరియాలు ఇవే
ఈస్ట్‌వెస్ట్ షీర్ జోన్ వెంబడి సగటు సముద్రం మట్టంకి 3.1 కి.మీ నుండి 7.6 కి మీ ఎత్తు వరకు ఉత్తర భారతదేశం అంతటా వ్యాపించి ఎత్తుకి వెళ్లే కొలది దక్షిణం వైపుకి వంపు తిరిగి ఉంది. రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. ఈ కారణంగా తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు *అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతారణ కేంద్రం తెలిపింది. రెండు రోజుల పాటు భారీ, అతిభారీ వర్షం తో పాటు అత్యంత భారీ వర్షాలు అక్క డక్కడ వచ్చే అవకాశం ఉంది . అందుకే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో మరో 3 రోజులు సెలవులు పొడిగింపు, ప్రభుత్వం ప్రకటన
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ ప్రజల కోసం జీహెచ్ఎంసీ అధికారులు 040-21111111 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎండ కనిపించి ఐదు రోజులు దాటిపోయింది. పెద్ద ఎత్తున వర్షం పడుతూనే ఉంది. ఇటీవలి కాలంలో ఇలాంటి పరి్సథితి లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే ప్రభుత్వం అన్ని విధఆలుగా సన్నద్దమయింది. ఎంత భారీ వర్షాలు పడినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు.. ప్రాణ నష్టం జరగకుండా ఏర్పాట్లు చేసింది. విపత్తు సహాయక బృందాలను రంగంలోకి దింపింది.