Breaking News Telugu Live Updates: బీఎస్ఎన్ఎల్ ఆదాయానికి గండి కొడుతున్న కేటుగాళ్ళు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 23 Jul 2022 08:31 PM

Background

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 4 నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన 50 మంది కీలక కార్యకర్తలతో భేటీ అవుతానని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో వైయస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ...More

బీఎస్ఎన్ఎల్ ఆదాయానికి గండి కొడుతున్న కేటుగాళ్ళు

నిజామాబాద్ జిల్లాలో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.  జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లోని ఓ ఇంట్లో  అసాంఘిక కార్యక్రమాలు, సైబర్ నేరాలకు పాల్పడుతున్న బాగోతాన్ని బయటపెట్టారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా, ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచడానికి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఉగ్గెర గణేషును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు సిద్ధపల్లి అజయ్ కుమార్ పరారీలో ఉన్నాడు. సీపీ నాగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుల నుంచి కంప్యూటర్, వాయిస్ ఓవర్ పరికరం, ఇంటర్నెట్ మెటీరియల్స్, పలు కంపెనీలకు సంబంధించిన సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి సుభాష్ నగర్ లోని ఓ ఇంట్లో పక్కా సమాచారంతో త్రీ టౌన్ పోలీసులు దాడి చేశారు. నిందితులపై 4వ టౌన్ లోనూ కేసు నమోదైంది.  అయితే నిందితుడు గణేష్ ను 4వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు సిద్దపల్లి అజయ్ కుమార్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీళ్లు బీఎస్ఎన్ఎల్ సంస్థకు వచ్చే ఆదాయాన్ని గండి కొడుతున్నారని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన టౌన్ సీఐ కృష్ణ, ఎస్సై సాయినాథ్, 4వ టౌన్ ఎస్సై సందీప్, ఎస్సై భాస్కరాచారితో పాటు వారి సిబ్బందికి అభినందనలు తెలిపారు సీపీ నాగరాజు.