Baba Fasiuddin :  గ్రేటర్ కార్పొరేషన్ మాజీ  డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ఇంచార్జ్ దీప్ దాస్ మున్షీ ఆయనకు  కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ.. కేసీఆర్ కు లే్ఖ పంపారు. ఇటీవలి కాలంలో పార్టీ అనుసరించిన విధానాలు తనకు నచ్చలేదని కేసీఆర్ కు రాసిన లేఖలో బాబా ఫసీయుద్ధీన్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చురుగ్గా పాల్గొన్నానన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసినా తనకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేసేందుకు కొంత మంది కుట్ర చేస్తూంటే పార్టీ అధినాయకత్వం వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. పైగా  వారికే మద్దచిచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు.                        

  


రాజకీయంగానే కాకుండా తనను భౌతికంగా కూడా నిర్మూలించే కుట్ర చేస్తున్నారని తెలిసి అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా పట్టించుకోలేదన్నారు. ఉద్యమకారుడికి రక్షణ కరువైందని ..అందుకే  బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా బాబా ఫసీయుద్దీన్ లేఖలో తెలిపారు. తర్వాత దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కేటీఆర్ అంటే ఎవరో తెలియని సమయంలో కేటీఆర్ పుట్టిన రోజును తొలి సారిగా తెంగాణ భవన్ లో 2007లో అట్టహాసంగా నిర్వహించానని గుర్తు చేశారు. టీఆర్ఎస్‌వీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పదేళ్లు పని చేశానని.. ఎన్ని కేసులు పెట్టిన వెనుదిరగలేదన్నారు.                 


రెండు సార్లు జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని మోసం చేశారని కేసీఆర్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ మేయర్ గా కొనసాగిస్తానని హమీ ఇవ్వడంతోనే  రెండో సారి కార్పొరేటర్ గా పోటీ చేశానని అయితే కేటీఆర్ మాత్రం ఇచ్చిన మాట మరిచారన్నారు. అయితే పార్టీనే ముఖ్యమనుకుని సర్దుకుపోయానన్నారు. కానీ గత మూడేళ్లుగా జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటీ గోపీనాథ్ వ్యక్తిగతంగా, రాజకీయంగా అణిచివేతకు పాల్పడుతున్నారని కనీసం తన డివిజన్ లో కూడా తనను తిరగనీయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కూడా తనకు అండగా నిలవలేదన్నారు. తన కుమారుడికి యాక్సిడెంట్ చేయించారని.. కుటుంబసభ్యులపై కేసులు పెట్టించినా పట్టించుకోలేదన్నారు.                                   


కొడంగల్ ఎన్నికల సమంయలో కోస్గి మండల ఇంచార్జ్ గా ఉన్న సమయంలో  ప్రత్యర్థులు దాడి చేశారు. కేసులు బనాయించారు. అయినా పార్టీ నుంచి తనను కనీసం పరామర్శించలేదన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ గెలిచిన తర్వాత తనను అనంతమొందించడానికి ఓ రౌడీషీటర్ కు సుపారీ ఇచ్చాడని ఆరోపించారు. ఈ విషయం చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో నాయకత్వం లేదని కార్యకర్తలకు భరోసా లేని చోట తాను ఉండలేనని బాబా ఫసియుద్దీన్ స్పష్టం చేశారు.