Telangana News :   తెలంగాణ సర్కార్‌పై గవర్నర్‌ తమిళిసై  అసెంబ్లీ ఆమోదించిన పెండింగ్‌ బిల్లులను జూలై 15లోగా క్లియర్‌ చేస్తామని ప్రకటించారు.  మున్సిపల్‌, ప్రైవేట్‌ యూనివర్సిటీ బిల్లులు గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి.  ఇప్పటికే  రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై, తెలంగాణ ప్ర‌భుత్వం మ‌ధ్య వివాదం సుప్రీకోర్టులో ఉంది.  గవర్నర్‌ బిల్లులు ఆమోదించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు.. గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. గవర్నర్ మొత్తం పది బిల్లులు ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సె 


రెండు సెషన్స్ అసెంబ్లీ సమావేశాల్లో  సమావేశాల్లో రాష్ట్రప్రభుత్వం 11  బిల్లులను తీసుకొచ్చింది. అందులో రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేయడం, సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వ విద్యాలయంగా మార్చడం, రాష్ట్రంలో మరి కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చేలా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ చట్టం, పురపాలక చట్టం, అజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులు సెప్టెంబర్ 13న ఉభయ సభల ఆమోదం పొందాయి. వీటిలో జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలపగా.. మిగిలిన 10 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.                                          


చివరికి  సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంతో ఆమె మూడు చట్టాలను ఆమోదించింది, అయితే మరో రెండింటిని రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపారు.  గవర్నర్ ఆమె ఆమోదం కోసం రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపారు మరియు మరో మూడింటిని తన వద్ద ఉంచుకున్నారు. గవర్నర్ ఆమోదించిన బిల్లులు, ప్రభుత్వానికి తిరిగి పంపిన బిల్లులు, రాష్ట్రపతి భవన్‌కు పంపిన బిల్లులపై స్పష్టత లేదు. తెలంగాణ ఫారెస్ట్ యూనివర్సిటీ బిల్లు, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లు, తెలంగాణ మహిళా యూనివర్సిటీ బిల్లులను ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా సవరణ బిల్లు, తెలంగాణ మోటార్ వెహికల్ ట్యాక్స్ సవరణ బిల్లులను ఆమె రాష్ట్రపతికి పంపినట్లు సమాచారం.                                     


ఇప్పుడు పెండింగ్ లో ఉన్న బిల్లులను కూడా మరో ఐదు రోజుల్లో ఆమోదిస్తామనే సమాచారం అందడంతో.. ప్రభుత్వ వర్గాలు కూడా సంతృప్తిగా ఉన్నాయి. ప్రభుత్వం, గవర్నర్ మధ్య  గ్యాప్ తగ్గిందన్న అభిప్రాయం  వినిపిస్తోంది. ఇటీవల బీజేపీ , బీఆర్ఎస్ పెద్దగా విమర్శించుకోవడం లేదన్న రాజకీయ పరిణామాల మధ్య తాజాగా గవర్నర్ నిర్ణయం ...ఆసక్తికరంగా మారింది.