TS New Mandals : తెలంగాణ ప్రభుత్వం పరిపాలానా సంస్కరణల్ని వేగంగా అమలు చేస్తోంది. అందులో భాగంగా కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. గతంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు అనేక మండలాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం తాజాగా పదమూడు మండలాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయంతీసుకుంది.
ఇళ్ల నుంచి బయటకు రావొద్దు, ఆ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్ ఆదేశాలు
నారాయణ పేట జిల్లా, అదే రెవిన్యూ డివిజన్ పరిధిలో..గుండుమల్ , కొత్తపల్లెలను కొత్తగా మండలాలుగా ఏర్పాటు చేశారు. వీటిని మండల కేంద్రాలు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. అలాగే వికారాబాద్ జిల్లాలోని, తాండూర్ రెవిన్యూ డివిజన్ పరిధిలో.. దుడ్యాల్ ను మండలంగా ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో అదే రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్న కౌకుంట్ల కూడా ఇక నుంచి మండల కేంద్రం. నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ రెవిన్యూ డివిజన్ పరిథిలో ఆలూర్ , డొంకేశ్వర్ లకను కూడా మండలాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: Heavy Rains In Telangana: ఎగువ రాష్ట్రంలో వర్షం వచ్చినా ఆ ఊరికి వణుకే, ఎందుకో తెలుసా ?
కామారెడ్డి జిల్లాలోని, బాన్స్ వాడ రెవిన్యూ డివిజన్ పరిథిలో.. డోంగ్లి, జగిత్యాల జిల్లా/జగిత్యాల రెవిన్యూ డివిజన్ పరిథిలో ఎండపల్లి ని కూడా మండలాలుగా మార్చారు. జగిత్యాల జిల్లా, కోరుట్ల డివిజన్ పరిథిలో, భీమారం కూడాఇక మండల కేంద్రం. నూతన మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ప్రకారం తక్షణం మండలాలు ఉనికిలోకి వస్తాయి.