Bjp Mla Raghunandan Arrest: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను ఘట్కేసర్(Ghatkesar) పోలీస్ స్టేషన్ కు తరలించారు. కర్మాన్ ఘాట్ ఆలయానికి వెళ్తోన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును ఎల్బీనగర్(LB Nagar) టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకుని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇటీవల కర్మన్‌ఘాట్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ కారణంగా అక్కడికి వెళ్లేందుకు రఘునందన్‌ యత్నించగా పోలీసులు అడ్డుకుని ఆయన అరెస్ట్‌ చేశారు. మరోవైపు రఘునందన్‌ అరెస్ట్‌ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ(Bjp) ఖండించింది. బీజేపీ నేతలపై టీఆర్ఎస్(TRS) సర్కార్ కక్ష గట్టి అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపించారు. అక్రమ అరెస్టులు చేయడం దారుణమని మండిపడింది. 



ధర్నా(Protest)కు అనుమతి నిరాకరణ


 క‌ర్మన్‌ ఘాట్ ఆంజ‌నేయ స్వామి ఆల‌యానికి వెళ్తోన్న దుబ్బాక(Dubbaka) బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క‌ర్మన్‌ఘాట్(Karmanghat) హ‌నుమాన్ టెంపుల్ వ‌ద్ద బీజేపీ ధర్నా తలపెట్టింది. ఈ ధ‌ర్నాకు పోలీసులు అనుమ‌తి నిరాకరించారు. ఈ క్రమంలో ఆలయం వద్దకు బీజేపీ నాయ‌కులు, కార్యక‌ర్తల‌ు భారీగా తరలివస్తున్నారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. క‌ర్మన్‌ఘాట్ ఆలయం వ‌ద్ద పోలీసులను భారీ మోహ‌రించారు.


అసలేం జరిగిందంటే?


 హైదరాబాద్ కర్మన్ ఘాట్ పరిధిలో గత మంగళవారం అర్ధరాత్రి గోవులను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని గో రక్షక్ సభ్యులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గో రక్షక్ సభ్యుల వాహనాన్ని దుండగులు బోలెరోతో ఢీకొట్టారు. అనంతరం గో రక్షకులపై కత్తులతో దాడికి దిగారు. గోరక్షకుల ఇన్నోవా కారును  ధ్వంసం చేశారు. దుండగులు కత్తులతో దాడి చేయడంతో రక్షక్ సభ్యులు స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలోకి పరుగులు తీశారు. దేవాలయంలోకి ప్రవేశించి వారిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సమాచారం అందుకున్న గో రక్షక్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కర్మన్ ఘాట్ పోలీసు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై బుధవారం ఉద్రిక్తత నెలకొంది. గోరక్షకులపై దుండగులు కత్తులతో దాడి చేసిన ఘటనలో నిందితులను శిక్షించాలని హిందూ సంఘాలు, బీజేపీ నేతలు స్థానిక ఆంజనేయస్వామి ఆలయం వద్ద నిరసనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై భైఠాయించి ఆందోళన తెలిపారు.