హైదరాబాద్, అమరావతి: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల రిటైర్మెంట్‍కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో ఈ నెలాఖరులో ఖాళీ అవుతున్న 10 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండగా, తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. ఈ 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి.


నెలాఖరులో వీరి పదవికాలం ముగియనుంది..


ఏపీలో ఐదుగురు ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, బీటీ నాయుడు, ఆశోక్ బాబు, దువ్వారపు రామారావుల పదవీకాలం ఈ నెలాఖరులోపే పూర్తి కానుంది. వీటిలో ఒకటి జనసేన నుంచి నాగబాబుకు, ఒకటి బీజేపీకి కేటాయిస్తే కనుక టీడీపీ నుంచి ముగ్గురికి ఎమ్మెల్సీగా ఛాన్స్ దక్కనుంది. బీజేపీకి ఒక సీటు ఇవ్వకపోతే మిగతా నాలుగు ఎమ్మెల్సీ సీట్లు టీడీపీ నేతల్ని వరించనున్నాయి. అదే విధంగా తెలంగాణలో 5 ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, మీర్జా హసన్ ల పదవీకాలం త్వరలో ముగియనుంది. 


ఎలక్షన్ కమిషన్ మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.  మార్చి 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఫలితాలు వెల్లడి కానున్నాయి.. మార్చి 29న తెలంగాణలో 5 మంది ఎమ్మెల్సీలు, ఏపీలో 5 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. దాంతో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పదవీకాలం ముగియనున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది.


ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసీ షెడ్యూల్ విడుదల, తేదీల వివరాలు


ఎన్నికల నోటిఫికేషన్ విడుదల - మార్చి 3, 2025
- నామినేషన్లకు చివరి తేదీ - మార్చి 10, 2025 సోమవారం
- నామినేషన్ల పరిశీలన - మార్చి 11, 2025
- నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు - మార్చి 13, 2025
- ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ - మార్చి 20, 2025 ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
- ఓట్ల లెక్కింపు - మార్చి 20న సాయంత్రం 5 గంటలకు


Also Read: MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ - ఈ సారి పది స్థానాలకు ఎన్నికలు