Foxconn Investment In Telangana: తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. గతంలో 150 మిలియన్లు డాలర్లు పెట్టుబడి పెట్టిన తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ సంస్థ మరో 400 మిలియన్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఈ విషయాన్ని ఫాక్స్‌కాన్ భారత ప్రతినిధి వి లీ సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ సంస్థ తెలంగాణలో మొత్తం 550 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది.
ఫాక్స్‌కాన్ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచ ప్రముఖ సర్వీస్ ప్రొడైవర్ సంస్థ ఫాక్స్‌కాన్‌తో తమకు ఉన్న దృఢమైన బంధానికి పెట్టుబడులే నిదర్శమని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇరువురి మధ్య పరస్పర అవగాహన కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో ఫాక్స్‌కాన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోందన్నారు. తెలంగాణ స్పీడ్‌కు ఇది మరో నిదర్శమని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇప్పటికే రూ.1,655 కోట్ల పెట్టుబడులు
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్స్ మానుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ఈ ఏడాది మే15నలో శంకుస్థాపన జరిగింది. ఫాక్స్‌కాన్ పెట్టుబడి ద్వారా 25,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రూ.1,655 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం 196 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 35,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదిరిన రెండున్నర నెలల్లోనే శంకుస్థాపన చేశారు.