TS Exit Poll Results 2024 LIVE: తెలంగాణలో ఎగ్జిట్ పోల్ ఎవరికి అనుకూలం - ఏబీపీ సీ ఓటర్ సర్వే ఏం చెబుతోంది?
Lok Sabha Election Exit Poll 2024 LIVE Updates: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఎటు మొగ్గారు అనేది జూన్ 4న తేలనుంది. అంత కంటే ముందు వివిధ సంస్థలు జరిపిన సర్వేల ఫలితాలు ఈ సాయంత్రం విడుదల కానున్నాయి.
'జన్ కీ బాత్' సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కాంగ్రెస్ 4 - 7, బీఆర్ఎస్ 0- 1, బీజేపీ 9 - 12, ఎంఐఎం 01, ఇతరులు 0 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోనున్నట్లు తేలింది.
'ఇండియా టీవీ - సీఎన్ఎక్స్' సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ 6 - 8, బీఆర్ఎస్ 0 - 1, బీజేపీ 8 - 10, ఎంఐఎం -01, ఇతరులు 0 స్థానాలు కైవసం చేసుకోనుంది.
తెలంగాణ లోక్ సభ ఫలితాలపై 'ఆరా' సంస్థ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం కాంగ్రెస్ 7 - 8, బీఆర్ఎస్ 0, బీజేపీ 8 - 9, ఎంఐఎం - 01, ఇతరులు 0 స్థానాలు కైవసం చేసుకోనున్నారు.
'పీపుల్స్ పల్స్' ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ 7 -9, బీఆర్ఎస్ 0 - 1, బీజేపీ 6 - 8, ఇతరులు 0 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోనున్నట్లు అంచనా వేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 9 సీట్లు, బీజేపీకి సైతం 7 నుంచి 9 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలో వచ్చింది.
జూన్ 1న ఎగ్జిట్ పోల్‌కు సంబంధించి ఎలాంటి డిబేట్‌లలో పాల్గొనకూడదని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నిర్ణయించింది. కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. జూన్ 4 నుంచి జరిగే చర్చల్లో కాంగ్రెస్ పాల్గొంటుందని పార్టీ మీడియా విభాగం అధినేత పవన్ ఖేడా తెలిపారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముందు (జూన్ 4) ఊహాగానాలలో మునిగిపోవాలని తాము కోరుకోవడం లేదన్నారు.
Telangana Exit Poll Results 2024 LIVE: ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చివరి విడత ఎన్నికల తరువాత ఎగ్జిట్ పోల్స్ విడుదలకు ఛాన్స్ ఉంది. జూన్ 1న లోక్‌సభ చివరి విడత ఎన్నికలు పూర్తవుతాయి. శనివారం సాయంత్రం 6.30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించవచ్చు అని ఈసీ స్పష్టం చేసింది.
భారతదేశంలో మొదటి ఎగ్జిట్ పోల్‌ను 1967లో చేశారు. ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ ది డెవలపింగ్ సొసైటీస్ (CSDS) తొలి ఎగ్జిట్ పోల్ రూపొందించింది, అయితే ఈ ఎగ్జిట్ పోల్ నమూనా చాలా చిన్నది. అనంతరం 1980 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా పలు సర్వే సంస్థలు పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్స్‌ను రూపొందించాయి.
Background
Telangana Lok Sabha Election Exit Poll 2024 LIVE Updates: దేశంలో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ నాయకులతో పాటు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం 7 దశలలో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించింది. చివరిదైన ఏడో విడత పోలింగ్ జూన్ 1న జరిగింది. శనివారం పోలింగ్ ముగిసిన తరువాత ప్రముఖ మీడియా సంస్థలతో పాటు పోల్ స్ట్రాటజీ సంస్థలు సైతం ఎగ్జిట్ పోల్ 2024 సర్వే ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఏబీసీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ జూన్ 1న సాయంత్రం 6.30 గంటల తరువాత ప్రకటించనున్నారు.
ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఎత్తివేసిన ఈసీ
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఒపీనియన్, ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఏప్రిల్ 19న ఉదయం 7 గంటల నుంచి జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. అంటే శనివారం సాయంత్రం చివరి విడత పోలింగ్ ముగిసిన అరగంటకు అంటే జూన్ 1న సాయంత్రం 6.30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది.
తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు
దేశ వ్యాప్తంగా 4వ విడతలో భాగంగా నిర్వహించిన ఎన్నికల్లో తెలంగాణలో పోలింగ్ జరిగింది. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ స్థానాలతో పాటు తెలంగాణ లోక్ సభ స్థానాలకు, మరికొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించింది ఈసీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గత ఏడాది నవంబర్ చివర్లో జరిగాయి. ఇటీవల నాలుగో విడతలో రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సిట్టింగ్ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్.. మాజీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
హైదరాబాద్ లోకసభ స్థానంపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ ఓ మహిళా అభ్యర్థిని బరిలో నిలిపింది. విరించి హాస్పిటల్స్ చైర్మన్ మాధవీలతను సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేయించింది బీజేపీ అధిష్టానం. బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ నుంచి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్ పోటీ చేయడంతో నాగర్ కర్నూలు సీటుపై సైతం ఆసక్తి నెలకొంది.
దేశంలోనే రిచెస్ట్ ఎంపీ అభ్యర్థుల్లో ఒకరైన బీజేపీ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రజలు ఆశీర్వదిస్తారని రేవంత్ రెడ్డి ధీమాగా ఉన్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. నేడు ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలతో నేతల్లో టెన్షన్ మరింత పెరగనుంది. జూన్ 4న కౌంటింగ్ వరకు ఎగ్జిట్ పోల్స్ పై చర్చ జరుగుతుంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -