Ex Deputy Cm Mahmood Ali Faints in Republic Day Celebrations: గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ (Hyderabad) తెలంగాణ భవన్ (Telangana Bhawan) లో శుక్రవారం ఉదయం వేడుకలు నిర్వహిస్తుండగా మాజీ డిప్యూటీ సీఎం, బీఆర్ఎస్ నేత మహమూద్ అలీ (Mahmood Ali) అస్వస్థతకు గురయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జాతీయ జెండాను ఎగురవేస్తున్న సమయంలో.. మహమూద్ అలీ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. వెంటనే స్పందించిన సిబ్బంది, ఇతర నేతలు ఆయన్ను పట్టుకుని పైకి లేపే ప్రయత్నం చేశారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. కాగా, ఈ అనూహ్య ఘటనతో నేతలు ఆందోళనకు గురయ్యారు.
Also Read: Viral News: హ్యాపీ ఇండిపెండెన్స్ డే- తెలంగాణ మంత్రి రాంగ్ ట్వీట్ వైరల్