Etala Rajendar : తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చేశారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ .. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ లోని తిరుమల గార్డెన్స్ లో ఓబీసీ మోర్చా మేడ్చల్ జిల్లా ప్రశిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయ్యారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు ఎంతో మంది నిరుద్యోగుల ప్రాణ త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామని.. ఈ రోజు తెలంగాణ నిరుద్యోగలను కెసిఆర్ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.
పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తూ కేసీఆర్ పాలన సాగిస్తున్నారు : ఈటల
బంగారు తెలంగాణ ని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు దళిత బంధు అని, రైతులకు రైతు బంధు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పేరుతో ప్రజలను మోసం చేస్తూ ఓట్లు దండుకుంటున్నారని, ధరణి పోర్టల్ పేరుతో రైతుల భూములను లాక్కునే పరిస్థితి ఈ రోజు తెలంగాణ లో ఏర్పడిందని అన్నారు. మానవ సమాజానికి అన్ని అందించి సంపన్న కాలంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి సమాజ సేవ కోసం మానవహితం కోసం సేవలందించినటువంటి ఈ వర్గాలకు, కులాలకు చిన్న చూపు చూస్తున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ వచ్చిన ప్రయోజనం లేదు.. ఉద్యమానికి కేంద్రంగా మారిపోయింది !
తెలంగాణ వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ లాంటి పండుగ సందర్భంగా కూడా ఆర్టీసీ కార్మికులు చేసిన ఉద్యమానికి కేంద్రం మారిపోయింది కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి మార్పు లేదన్నారు. నిరుద్యోగులు, కార్మికుల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రము వచ్చిందన్నారు. డబ్బులు పంచే ప్రభుత్వం గొప్పది కాదని.. ఉపాధి, సంక్షేమ పథకాలు కల్పించాలన్నారు ఈటల. తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని.. దమ్ముంటే తెచ్చిన అప్పుు, ఖర్చు, కేటాయింపులు, జీవోలను వెబ్ సైట్లో పెట్టాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మీద తాము బతకడం లేదని.. కేంద్రమే తమపై ఆధారపడి బతుకుతుందని చెప్పడం సిగ్గు చేట ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక కేసీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడుతున్న ఈటల
టీఆర్ఎస్‌లో ఒకప్పుడు కీలక నేతగా ఉన్న ఈటల రాజేందర్ కేసీఆర్‌తో విభేధాలు రావడంతో బయటకు వచ్చారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బీజేపీ తరపున పోటీ చేసి గెలిచారు. అప్పట్నుంచి కేసీఆర్ సర్కార్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వాల అప్పుల లెక్కలు చెప్పడంతో ఈ అంశంపై ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కొంత కాలంగా బీజేపీ ఘాటు విమర్శలు చేస్తోంది.
ఒరిజినల్ కాంగ్రెస్ Vs వలసల కాంగ్రెస్! టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోవర్టా?