Telangana Elections Counting 2024 News Updates: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉదయం 8 గంటలకు కౌంటిగ్ స్టార్ట్ అవుతుంది. 17 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రదేశాల్లో కౌటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో 49 మంది అజర్వర్ల, 2440 మైక్రో అబ్జర్వర్లను నియమించింది ఎన్నికల సంఘం. వీళ్లకు సహాయం చేసేందుకు పది వేల మంది సిబ్బందిని ఈసీ నియమించింది. వీళ్లతోపాటు మరికొందర్ని అదనంగా నియమించారు. అవసరమైనప్పుడు వారి సేవలను కూడా వినియోగించుకుంటారు.
తెలంగాణలో ఎక్కువ రౌండ్లు చొప్పదండి, దేవరకొండ యాకూత్పుర లో ఉన్నాయి. అక్కడ 24 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. అతి తక్కువ ఆర్మూర్, అశ్వరావుపేట, భద్రాచలంలో ఉన్నాయి. ఈ కేంద్రాల్లో కేవలం 13 రౌండ్లలోనే కౌంటిగ్ పూర్తికానుంది. ఈసారి తెలంగాణలో దాదాపు మూడు లక్షల వరకు పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. చేవెళ్ల, మల్కాజ్‌గురిలో వీటిని లెక్కిస్తారు.
భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంది ఎన్నికల సంఘం. ప్రతి కేంద్రంలో సీసీకెమెరాలతో నిఘా పెట్టింది. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ సెంటర్ వరకు ఈవీఎంలు తరలించేటప్పుడు కూడా సీసీటీవీ మానిటరింగ్ ఉంటుందని. దీంతోపాటు 12 బృందాల కేంద్ర బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేసింది.
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు వీళ్లే
నియోజకవర్గం పేరు | కాంగ్రెస్ అభ్యర్థి పేరు | బీజేపీ అభ్యర్థి పేరు | బీఆర్‌ఎస్ అభ్యర్థి పేరు | |
1 | ఆదిలాబాద్ | సుగుణ కుమారి | గెడ్డెం నగేష్ | ఆత్రం సక్కు |
2 | పెద్దపల్లి | గడ్డం వంశీకృష్ణ | మాసగోని శ్రీనివాస్ | కొప్పుల ఈశ్వర్ |
3 | కరీంనగర్ | వెలిచర్ల రాజేందర్‌రావు | బండి సంజయ్ | వినోద్‌కుమార్ |
4 | నిజామాబాద్ | జీవన్ రెడ్డి | ధర్మపురి అరవింద్ | బాజిరెడ్డి గోవర్దన్ |
5 | జహీరాబాద్ | సురేష్‌కుమార్ | బీబీపాటిల్ | గాలి అనిల్ కుమార్ |
6 | మెదక్ | నీలంమధు | రఘునందన్ రావు | వెంకట్రామిరెడ్డి |
7 | మల్కాజిగిరి | సునీతా మహేందర్‌రెడ్డి | ఈటల రాజేందర్ | రాగిడి లక్ష్మారెడ్డి |
8 | సికింద్రాబాద్ | దానం నాగేందర్ | కిషన్ రెడ్డి | పద్మారావు గౌడ్ |
9 | హైదరాబాద్ | అసదుద్దిన్ ఓవైసీ | మాధవీలత | గడ్డం శ్రీనివాస్ యాదవ్ |
10 | చేవెళ్ల | రంజిత్ రెడ్డి | కొండా విశ్వేశ్వర్‌రెడ్డి | కాసాని జ్ఞానేశ్వర్ |
11 | మహబూబ్‌నగర్ | చల్లా వంశీచంద్‌రెడ్డి | డీకే అరుణ | మన్నె శ్రీనివాస్ రెడ్డి |
12 | నాగర్ కర్నూలు | మల్లురవి | భరత్ ప్రసాద్ | ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ |
13 | నల్గొండ | రఘువీర కుందూరు | శానంపుడి | సైదిరెడ్డి కంచర్ల కృష్ణారెడ్డి |
14 | భవనగిరి | కిరణ్‌కుమార్ రెడ్డి | బూర నర్సయ్య | క్యామ మల్లేష్ |
15 | వరంగల్ | కడియం కావ్య | ఆరూరి రమేష్ | మారేపల్లి సుధీర్ కుమార్ |
16 | మహబూబాబాద్ | బలరాం నాయక్ | సీతారాంనాయక్ | మాలోత్ కవిత |
17 | ఖమ్మం | రామసహాయం రఘురామ్ రెడ్డి | వినోద్‌రావు | నామా నాగేశ్వరరావు |