ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ లేఖ రాశారు. గత విచారణ సందర్భంగా కవిత ఈడీకి ఇచ్చిన ఫోన్ లలో డేటా బయటికి తీస్తున్నందున అందుకు సాక్షిగా ఆథరైజ్డ్ పర్సన్‌ను పంపించమని ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ కోరారు. ఆ ఫోన్లు ఓపెన్ చేసేటప్పుడు స్వయంగా కూడా హాజరు కావచ్చని లేఖలో పేర్కొన్నారు. దీంతో కవిత ఇచ్చిన ఆథరైజేషన్‌తో ఆ ప్రక్రియకు భరత్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన బీఆర్ఎస్‌కు లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంగతి తెలిసిందే.
Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
ABP Desam
Updated at:
28 Mar 2023 01:04 PM (IST)
కవిత ఇచ్చిన ఆథరైజేషన్‌తో ఆ ప్రక్రియకు భరత్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన బీఆర్ఎస్‌కు లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంగతి తెలిసిందే.
కవిత (ఫైల్ ఫోటో)