ED Shock For TRS MP :   టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ కంపెనీ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ జప్తు చేసింది. . రాంచీ ఎక్స్‌ప్రెస్ వే కేసులో మధుకాన్ కు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రూ.96 కోట్ల విలువైన  మొత్తం 105 ఆస్తులు అటాచ్ చేసినట్లుగా ప్రకటించింది.  ఈ కేసుకు సంబంధించి గతేడాది జూన్ లో నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకుని ఆ డబ్బును దారి మళ్లించినట్లు ఆరోపణలు వున్నాయి. రూ.1064 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు వున్నాయి. ఈ క్రమంలోనే నామా నివాసంతో పాటు కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆ రుణానికి సంబంధించి నాగేశ్వరరావు పర్సనల్ గ్యారంటీర్ గా వున్నారు. 





రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే ఎస్పీవీ కంపెనీ BOT పద్ధతిలో ప్రాజెక్టు చేపట్టింది.  నేషనల్ హైవే సంస్థ ప్రాజెక్టు పూర్తి కోసం ముందుకు వచ్చింది. కానీ ఈడీ విచారణల కారణంగా వెనక్కి వెళ్ళిపోయింది.   ఈ ప్రాజెక్టులో నిధులు మళ్లించడానికి అసలు అవకాశం లేదని నామా నాగేశ్వరరావు చెబుతున్నారు. గతంలో విచారణకు రావాలని ఆయనకు నోటీసులు కూడా ఈడీ ఇచ్చింది. అియతే ఆయన  హాజరు కాలేదు. 


దీనిపై బీజేపీ ఎంపీ అర్వింద్ స్పందించారు. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన ఆస్తులను అటాచ్ చేయడంపై ఈడీ చెప్పిన వివరాలను ఆయన ట్వీట్ చేశారు.