Dussehra Holidays: రానున్న దసరా, బతుకమ్మ కోసం తెలంగాణ సెప్టెంబర్ 26వ తేదీ నుండి అక్టోబర్ 9 వరకు సెలవులు ఇస్తోంది. అంటే 14 రోజుల సెలవులు. సెప్టెంబరు 25వ తేదీ ఆదివారం రోజు వస్తోంది. అంటే మొత్తం 15 రోజుల పాటు సెలవులు వచ్చినట్లు. అక్టోబర్ 10వ తేదీన విద్యా సంస్థలు తిరిగి తెరచుకోనున్నాయి. ఇక అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సారి దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలకు కాలేజీలు, పాఠశాలలకు భారీగా సెలవులు ఇచ్చారు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా తొలి స్థానంలో ఉంటుంది. అందుకే బడులకు, కాలేజీలకు ముందుగానే సెలవులు ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్లు ఈ సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లి పండగను వైభవంగా జరుపుకుంటారు.
ఎక్కువ రోజుల పాటు సెలవులు ఇచ్చిన ప్రభుత్వాలు..
ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలల పని దినాలు ఉంటాయని తెలిపింది తెలంగాణ సర్కారు. ఏప్రిల్ 24, 2023 విద్యా సంవత్సరం చివరి రోజుగా పేర్కొంది. ఏప్రిల్ 25వ తేదీ నుండి జూన్ 11వ తేదీ, 2023 వరకు వేసవి సెలవులు ఉంటాయి. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 22 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు మిషనరీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు.. నాన్ మిషనరీ పాఠశాలలకు జనవరి 13 వ తేదీ నుండి 17, 2023 వరకు సంక్రాంతి సెలవులను షెడ్యూల్ చేశారు.
9 రోజులే సెలవులు ఇవ్వాలంటూ సూచన..!
దసరా పండుగకు భారీగా సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరి గంతేశారు. మొత్తం 15 రోజుల హాయిగా గడపొచ్చని అనుకుంటారు. 15 రోజులు ఎక్కడెక్కడికి వెళ్లాలి అనే ప్లాన్ కూడా అయిపోయే ఉంటుంది. అలాంటి వారికి షాక్ తగిలే న్యూస్ ఒకటి వచ్చింది. ఈ ఏడాది దసరా పండుగకు 15 రోజులు కాకుండా 9 రోజులే సెలవులు ఇవ్వాలని తెలంగాణ పాఠశాల విద్యా శాఖకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్.సీ.ఈ.ఆర్.టీ) సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కరోనా వల్ల విద్యార్థులు చాలా వెనక బడి పోయి ఉన్నారు. మరో వైపు జులైలో వర్షాలు, సెప్టెంబర్ 17న పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో 7 రోజులు పని దినాలు తగ్గాయి. ఆ సెలవులను భర్తీ చేసేందుకు ఎస్.సీ.ఈ.ఆర్.టీ మరో ప్రతిపాదనను పాఠశాల విద్యా శాఖ ముందు ఉంచింది. నవంబరు నుండి ఏప్రిల్ వరకు రెండో శనివారాలు కూడా పాఠశాలలు పని చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దసరా సెలవులను సెప్టెంబర్ 26 నుండి కాకుండా అక్టోబర్ 1వ తేదీ నుండి ఇవ్వాలని ఎస్.సీ.ఈ.ఆర్.టీ సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి సూచనలకు పాఠశాల విద్యా శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
గతేడాది 16, ఈ ఏడు 22 రోజులు..!
ఇక దూర్గా పూజ నేపథ్యంలో ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం 11 రోజుల పాటు ఆఫీసులకు సెలవులు ప్రకటించింది. సెప్టెంబరు 30 నుండి అక్టోబర్ 10 వరకు సెలవులు ఇచ్చింది. అంతే కాకుండా, మొత్తంగా దుర్గా పూజ జరిగే నెలలో 22 రోజులు సెలవులు తీసుకునే వెసులు బాటు కల్పించింది. ఈ సెలవుల సంఖ్య గతేడాది 16 రోజులుగా ఉండగా.. ఇప్పుడు ఏకంగా 22 రోజులు ఉంది.