Telangana Assembly :  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు దానం నాగేందర్ దారుణమైన భాషతో బీఆర్ఎస్ సభ్యులపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో  జరిగిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ప్రసంగిస్తున్న సమయంలో కేటీఆర్ ప్రస్తావన తీసుకు వచ్చారు. ఆ సమయంలో బీఆర్ఎస్ సభ్యులు అడ్డుతగలడంతో ఆయన విరుచుకుపడ్డారు. " ఏయ్ .. మూస్కోవోయ్.. ఏం అనుకుంటున్నార్రా మీరు..   తల్చుకుంటే హైదరాబాద్‌లో తిరగలేరు. తోలు తీస్తా కొడుకుల్లారా  " అంటూ విరుచుకుపడ్డారు. మీ బండారం బయటపెడ్తానంటూ దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచానని ఈ సందర్భంగా దానం నాగేందర్ గుర్తుచేశారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు మరితం తీవ్రంగా నిరసన చేపట్టారు.                                             

  


మజ్లిస్ అభ్యంతరంతో క్షమాపణ చెప్పిన దానం                      


మజ్లిస్  కూడా దానం భాషపై  అభ్యంతరం తెలిపింది.  తక్షణమే దానం నాగేందర్ క్షమాపణ చెప్పాలని ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. దానం వ్యాఖ్యలపై దుమారం రేగడంతో తర్వాత  ఆయన వివరణ ఇచ్చారు. తాను వాడిన పదాలు వాడుక భాషలోవేనని ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. చేశారు  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను కవ్వించారని..   అయినా పరిధిలోనే మాట్లాడానని చెప్పుకొచ్చారు. తాను   మాట్లాడిన మాటలు సభలోని సభ్యులకు బాధ కలిగించి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాననని..    గతంలో నేను ఎప్పుడు నోరు జారలేదు. సబ్జెట్ మీద మాట్లాడుతుంటే వాళ్లే నన్ను దూషించారని ఆరోపించారు.  చీఫ్ మినిస్టర్‌ను చీప్ మినిస్టర్ అన్నది కేటీఆర్ల అని..  అయినా తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ అడుగుతున్నానని అని దానం నాగేందర్ ప్రకటించారు.  


బీఆర్ఎస్ తరపున గెలిచి ఆ పార్టీనే తిడుతున్న దానం నాగేందర్             


దానం నాగేందర్ బీఆర్ఎస్ తరపునే గెలిచారు. అధికారికంగా రికార్డుల్లో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. స్వల్ప తేడాతో కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన అధికారికంగా బీఆర్ఎస్ సభ్యునిగా ఉంటూ... కాంగ్రెస్ తరపున మాట్లాడుుతున్నారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ పైనా విమర్శలు చేస్తూండటంతో.. బీఆర్ఎస్ సభ్యులు అడ్డు తగలడంతో ఆయన విరుచుకుపడ్డారు. 


దానంపై అనర్హత వేటు కోసం న్యాయపోరాటం చేస్తున్న బీఆర్ఎస్ 


దానంపై అనర్హతా వేటు వేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని న్యాయస్థానానికి కూడా వెళ్లారు. అక్కడ విచారణ జరుగుతోంది. దానంపై అనర్హతా వేటు వేయాలని బీజేపీ కూడా న్యాయపోరాటం చేస్తోంది.