Dalit Dandora Yatra Live Updates: ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ ‘దళిత దండోరా’.. కదం తొక్కిన నేతలు

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత దండోరా యాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

ABP Desam Last Updated: 09 Aug 2021 06:46 PM
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు : రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్‌ పాలనలో ఎస్సీలు, ఎస్టీల జీవితాలు చితికిపోయాయని, ఆదివాసీల జీవితాలు మార్చాలనేదే కాంగ్రెస్‌ ప్రణాళిక అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలు తెచ్చిందని రేవంత్ అన్నారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ఎస్సీలు గుర్తుకు వస్తారన్న ఆయన...దళితబంధును తెలంగాణ మొత్తం ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి దళిత, గిరిజన దండోరా సభలో అన్నారు. 

దళిత దండోరా సభకు పోటెత్తిన జనం

తెలంగాణ కాంగ్రెస్‌ ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్న దళిత, గిరిజన దండోరా సభకు  జనం పోటెత్తారు. దీంతో గుడిహత్నూర్‌ నుంచి ఇంద్రవెల్లి మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేస్తున్నారు. సభాస్థలికి దూరంగా వాహనాలను పార్కింగ్‌ చేయాలని కోరుతున్నారు.  కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కాలినడకన సభకు తరలివస్తున్నారు. సభాస్థలిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.  


 





బయల్దేరిన కాంగ్రెస్ నేతలు

ఇంద్రవెల్లి దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభకు కాంగ్రెస్ నాయకులంతా బయలుదేరి వెళ్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు.





అమరవీరుల స్తూపానికి సీతక్క నివాళులు

ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దళిత-గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ఈ సభ ద్వారా ఎండగడతామని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గిరిజనులను కాల్చిచంపిన చరిత్ర కేసీఆర్‌ది అని ఆరోపించారు. అయితే, సమైఖ్య పాలనలో ఇంద్రవెల్లిలో జరిగిన కాల్పుల గురించి ప్రస్తావించడం సరికాదని అన్నారు. ఆ నాటి ఆ తప్పును కాంగ్రెస్ పార్టీ సరిదిద్దుకుందని, ఆదివాసులకు క్షమాపణ కూడా చెప్పామని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

ఇంద్రవెల్లికి బ‌య‌లుదేరిన రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లికి బయలుదేరారు. వేలాది మంది కార్యకర్తల వాహ‌న శ్రేణితో ఆయన ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్న దళిత దండోరా సభకు హాజరవుతున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మ‌ధుయాస్కి, సీత‌క్క వంటి నేత‌లంతా ఇంద్రవెల్లికి వస్తున్నారు.




 





Background

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 9న దళిత దండోరాకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో ఉద్యమాలకు వేదికగా నిలిచిన ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి నుంచి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను మోగించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. సోమవారం ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం నుంచే కాంగ్రెస్ నేతలు ఆదిలాబాద్ జిల్లాలో మకాం వేశారు. దళిత బంధు తెలంగాణ మొత్తం అమలు చేయాలనే డిమాండ్‌తో పాటు గిరిజనుల పోడు భూముల వ్యవహారంపై కూడా కాంగ్రెస్ నేతలు గళమెత్తనున్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.