CV Anand name almost finalized as Telangana  new DGP:  తెలంగాణ రాష్ట్ర నూతన పోలీస్ బాస్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ప్ర , సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం డీజీపీగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.    1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ పేరు   UPSC  పంపిన ముగ్గురు పేర్లతో కూడిన ప్యానెల్‌లో  అగ్రస్థానంలో ఉంది. రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనే పోలీస్ బాధ్యతలు చేపట్టేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డి పదవీ కాలం ఏప్రిల్ నెలాఖరుతో ముగియనుండటంతో, తదుపరి వారసుడిగా ఆనంద్ పగ్గాలు చేపట్టనున్నారు.  సీనియారిటీలో తిరుగులేని అధికారి 

Continues below advertisement

ప్రస్తుతం తెలంగాణ పోలీస్ క్యాడర్‌లో సీవీ ఆనంద్ అత్యంత సీనియర్ అధికారిగా ఉన్నారు. 1989, 1990 బ్యాచ్‌లకు చెందిన అధికారులు రిటైర్ అవ్వడం లేదా కేంద్ర సర్వీసులకు వెళ్లడంతో, 1991 బ్యాచ్‌కు చెందిన ఆనంద్ రేసులో అందరికంటే ముందు నిలిచారు. UPSC ప్రతిపాదించిన జాబితాలో వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా పేర్లు ఉన్నప్పటికీ, వారు 1994 బ్యాచ్ వారు కావడంతో ఆనంద్‌కు ఉన్న మూడేళ్ల అదనపు సీనియారిటీ ప్రధాన బలంగా మారింది.

దీర్ఘకాలిక పదవీ కాలం ప్లస్ పాయింట్ 

Continues below advertisement

ప్రభుత్వం సీవీ ఆనంద్‌ను ఎంపిక చేయడానికి మరో కీలక కారణం ఆయన సర్వీస్ కాలం. ఆయన 2028 మే  వరకు సర్వీసులో ఉంటారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, డీజీపీగా నియమితులైన వారు కనీసం రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉండాలి. సీవీ ఆనంద్ నియామకం జరిగితే, ఆయనకు రెండేళ్లకు పైగా పదవీ కాలం ఉంటుంది. ఇది రాష్ట్రంలో శాంతిభద్రతల స్థిరత్వానికి, పోలీస్ సంస్కరణల అమలుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

 అపార అనుభవం.. క్షేత్రస్థాయి పట్టు 

సీవీ ఆనంద్‌కు క్షేత్రస్థాయిలో   పరిపాలనలో విశేష అనుభవం ఉంది. గతంలో ఆయన హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసి మెట్రోపాలిటన్ పోలీసింగ్‌లో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, పౌర సరఫరాల శాఖలో ఐటీ సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రభుత్వానికి భారీగా ఆదాయం మిగిల్చారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులపై, ప్రస్తుత సవాళ్లపై ఆయనకు ఉన్న పట్టును పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఆయన వైపే మొగ్గు చూపింది.

 ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన 

ప్రస్తుత డీజీపీ బి. శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ అధికారి అయినప్పటికీ, గతంలో అనివార్య కారణాల వల్ల ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు  అప్పగించాల్సి వచ్చింది. ఇప్పుడు నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి డీజీపీని నియమించాల్సి ఉండటంతో ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేసింది. సీవీ ఆనంద్ పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు  జారీ చేసే అవకాశం ఉంది. ఈ నియామకంతో తెలంగాణ పోలీస్ శాఖలో సరికొత్త మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.