Constables Did PCR To Unconscious Man In Mulugu District: గోడ మీద నుంచి పడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఓ వ్యక్తికి ఇద్దరు కానిస్టేబుళ్లు అతనికి ఊపిరి పోశారు. అయితే, తలకు బలమైన గాయం కావడంతో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా (Mulugu District) గోవిందరావుపేట మండలం పసర గ్రామంలోని చౌరస్తాలో ఆదివారం లక్ష్మణ్ అనే వ్యక్తి గోడపై నుంచి స్పృహ తప్పి కింద పడిపోయాడు. అదే సమయంలో మంత్రి సీతక్క బందోబస్తు నిమిత్తం అక్కడకు వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లు బీ.మధు, ఎల్.మధు బాధితున్ని గమనించి సీపీఆర్ చేశారు. ఓ కానిస్టేబుల్ బాధితునికి సీపీఆర్ చేయగా.. మరో కానిస్టేబుల్ శ్వాస అందించారు. కొద్దిసేపటి తర్వాత వీరి ప్రయత్నం ఫలించి బాధితుడు లక్ష్మణ్ లేచి కూర్చున్నాడు.
బలమైన గాయంతో..
వెంటనే బాధితుడు లక్ష్మణ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గోడ మీద నుంచి పడిన క్రమంలో అతని తలకు బలమైన గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో విషాదం నెలకొంది. అయితే, వ్యక్తిని కాపాడేందుకు కానిస్టేబుల్స్ చేసిన ప్రయత్నాన్ని పోలీస్ ఉన్నతాధికారులు, స్థానికులు అభినందించారు.
Also Read: Shadnagar CI Suspension | దళిత మహిళపై పోలీసులు దాడి, షాద్‌నగర్ సీఐతో పాటు ఐదుగురు సస్పెండ్