Congress party is showing a lead in the first phase of Telangana Panchayat elections:   తెలంగాణలో గ్రామ పంచాయతీలకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో ఓటర్లు భారీగా పాల్గొన్నారు. మొత్తం 79 శాతం పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో, మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం, కాంగ్రెస్ మద్దతుదారులు ఆధిక్యంలో ఉండగా, బీఆర్ఎస్ గట్టిపోటీ ఇస్తోంది. ఇతరులు మూడో స్థానంలో ఉండగా..  బీజేపీ మద్దతిచ్చిన అభ్యర్థులు నాలుగో స్థానంలోఉన్నారు. 

Continues below advertisement

తెలంగాణలో మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి, ఇందులో తొలి దశలో 4,236 గ్రామాలు, 37,440 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.  తొలి దశలో 395 సర్పంచ్‌లు మరియు 9,331 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, దీంతో 3,836 గ్రామాలు ,27,960 వార్డులు కు మాత్రమే పోలింగ్ జరిగింది.  

ఈ దశలో 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు మరియు 65,455 మంది వార్డు సభ్యులు పోటీ పడ్డారు.  పోలింగ్ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. నల్గొండ, సంగారెడ్డి వంటి ప్రాంతాల్లో స్వల్ప ఘర్షణలు జరిగినప్పటికీ, పోలీసులు త్వరగా నియంత్రించారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగింది.  

ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ట్రెండ్స్ స్పష్టమయ్యాయి. తాజా అప్‌డేట్స్ ప్రకారం, కాంగ్రెస్ మద్దతుదారులు 1,368 స్థానాల్లో  సర్పంచ్‌లుగా గెలిచారు.  బీఆర్ఎస్ 378, బీజేపీ 81, ఇతరులు 230 స్థానాల్లో  గెలిచారు.  ఆసిఫాబాద్, నిర్మల్ లోని కొన్ని గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఎన్నికలు జరగలేదు.  ఈ ఎన్నికలు పార్టీ ఆధారంగా కాకుండా నిర్వహించినప్పటికీ, రాజకీయ ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయా పార్టీలు బలపరిచిన అభ్యర్థులు అని ప్రచారం చేసుకున్నారు.