Congress MLA Jagga Reddy: రాహుల్ గాంధీతోనే తన ప్రయాణం అని, తాను బీఆర్ఎస్ లోకి వెళ్తున్న అనే ప్రచారం అబద్ధం అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే  జగ్గారెడ్డి. బీఆర్ఎస్ ప్రకటించబోయే తొలి జాబితాలో జగ్గారెడ్డి పేరు ఉంటుందని సైతం సోషల్ మీడియాతో పాటు కాంగ్రెస్ లోని ఓ వర్గం నుంచి ప్రచారం జరిగింది. కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. మూర్ఖులు, దద్దమ్మలు ఈ ప్రచారం బంద్ చేయాలంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఏ సమావేశం జరిగినా నాకు ఫోన్లు వస్తాయి, సమావేశానికి రావాలని చెబుతారని, ఈరోజు పిసిసి సమావేశం.. అది డైరెక్షన్ మీటింగ్ అన్నారు. అన్ని సమావేశాలు, పార్టీ మీటింగ్ లకు హాజరవుతున్నట్లు తెలిపారు.


చాలా సంవత్సరాలు కస్టపడి లీడర్ అయ్యానని, 19 ఏళ్లకే మున్సిపల్ లీడర్ అయ్యానన్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతూ రాజకీయ జీవితంలో కొనసాగుతున్న తన పేరు తగ్గించాలని వార్తలు వేస్తే డ్యామేజ్ జరగుతుందని చూస్తున్నారని చెప్పారు. జగ్గారెడ్డి బీఆర్ఎస్ లోకి రావద్దని సంగారెడ్డిలో నిరసన తెలుపుతున్న వారంతా తన దగ్గర నుండి పోయినవారే అన్నారు. వాళ్లను లీడర్లను చేసింది నేనే. శాసనసభలో ముఖ్యమంత్రి, మంత్రులను కలవద్దా... వినతి పత్రాలు ఇచ్చి ఫండ్స్ అడిగే సాంప్రదాయం లేదా అని ప్రశ్నించారు. 


కేసీఆర్ మీద తిరగబడ్డ మొదటి నాయకుడు జగ్గారెడ్డి మాత్రమే అన్నారు. 119 నియోజకవర్గల్లో 50 నియోజకవర్గల్లో గెలిచే బలమైన నేతలు ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సెకండ్ పొజిషన్ ఉన్న మరో 30 సీట్లపై మొదటి స్థానానికి రావడానికి గట్టి ప్రయత్నం చేయాలన్నారు. ఈ ఒక్కసారి కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాం. కాంగ్రెస్ లో గొడవలు కామన్.. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. 


ఒకప్పుడు హరీష్ రావు బీ ఫారం కోసం అప్లికేషన్ లకు డబ్బులు తీసుకున్నారు.. ఇప్పుడు మేం చేస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మేము సంతోషంగా డిడి కోసం డబ్బులు ఇస్తున్నాం.. పార్టీ కోసం ఉపయోగిస్తాం. ప్రాంతీయ పార్టీల్లో సింగిల్ పర్సన్ నడిపిస్తాడు.. కాంగ్రెస్ అలా కాదన్నారు. మళ్ళీ చెప్తున్నా.. జగ్గారెడ్డి రాజకీయ ప్రయాణం రాహుల్ గాంధీతోనే అన్నారు.


రాహుల్ గాంధీ జోడోయాత్ర సంగారెడ్డి మీద నుండి వెళ్తుంటే సంతోషపడ్డాను.. ఆర్థిక ఇబ్బందులున్నా బాగా చేశానన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర తరువాత కలిసినప్పుడు నాతో రెండు మూడు సార్లు నా పేరు పెట్టి చాలా బాగా ఆర్గనైజ్ చేశావ్ అని రాహుల్ అన్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ అభినధించిన 10 రోజులకే సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నారని, కోవర్ట్ అని తనపై ప్రచారం చేసినట్లు కీలక విషయాలు వెల్లడించారు. 2017 లో కోట్లు పెట్టి సంగారెడ్డిలో రాహుల్ సభ ఏర్పాటు చేశా. అందుకే కేసులు పెట్టి 2018లో జైళ్లో వేశారని.. అయినా ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. 


ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయద్దని రేవంత్ రెడ్డి తీర్మానం చేస్తా... నాకు పర్మిషన్ ఇవ్వండని నా భార్యను నిలబెట్టమన్నాను. కేసీఆర్ సొంత జిల్లాలో ఏకగ్రీవం కావద్దని బరిలో నిలిచాం. కాంగ్రెస్ కి 230 మాత్రమే ఓట్లు ఉన్నాయి.. గెలవలేమని తెలుసు అయినా పోటీ చేశామన్నారు. కాంగ్రెస్ 230 ఓట్లు వేపించి 9 అదనపు ఓట్లు తెచ్చాను... కానీ తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ లో జగ్గారెడ్డి ఉండద్దా...? ఇది ఎవరిదైనా వ్యూహమా.. నేను కన్నేర్ర చేస్తే.. ఎక్కడ పోతారు.. మీరు ఉంటారా అని ప్రశ్నించారు. 


ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో మాట్లాడితే నడి రోడ్డు మీద బట్టలు ఇప్పి నిలబెడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో ఇప్పుడున్న లీడర్ల లో సోషల్ మీడియా ఎక్స్ పర్ట్ ఎవరు. ఇదంతా టీడీపీ కల్చర్, వాళ్ల నుంచే ఈ కల్చర్ వచ్చిందన్నారు. మా పార్టీలోకి ఏ పార్టీ నుండి వచ్చినా కాంగ్రెస్ వాళ్ళే.. సోషల్ మీడియాను ఎక్కువగా వాడేది టీడీపీయే అన్నారు. ఢిల్లీ వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీని రెండవ సారి కలిశాను. ఆయన 20 నిముషాలు సమయం ఇచ్చారని, చెప్పాల్సింది చెప్పానన్నారు. త్వరలో రాహుల్ గాంధీతో సంగారెడ్డిలో కార్యక్రమం నిర్వహిస్తానని తెలిపారు.