Police complaint against actor Srikanth Bharat:  జాతి పిత మహాత్మా గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తెలుగు సినిమా నటుడు శ్రీకాంత్ అయ్యంగార్  పై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు  చేశారు.   బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఒక కేసు నమోదయింది. గాంధీ జయంతి సందర్భంగా ఆయన Xలో పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లలో ఆగ్రహం రగిలింది.  

Continues below advertisement

 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాంత్ అయ్యంగార్ తన X ఖాతాలో ఒక సిరీస్ వీడియోలు పోస్ట్ చేశారు. ఈ వీడియోల్లో మహాత్మా గాంధీని తీవ్రంగా విమర్శిస్తూ, "గాంధీ మహాత్మా డా? జాతి పితా?" అనే ప్రశ్నలు లేవనెత్తారు. ఇందులో అసభ్య, అపమానకరమైన భాష ఉపయోగించి, గాంధీజీ అహింసా సిద్ధాంతం, స్వాతంత్ర్య సమరంలో పాత్రను ఎగతాళి చేశారు. ఈ వ్యాఖ్యలు గాంధీజీ భారత స్వాతంత్ర్య ఉద్యమానికి చేసిన కృషిని, జాతి పితగా పూజించే స్థాయి దెబ్బతీస్తాయని బల్మూరి వెంకట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియోలు వేగంగా వైరల్ అవుతూ, సోషల్ మీడియాలో విస్తృత చర్చనీయాంశంగా మారాయి. 

Continues below advertisement

శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలు  జాతి గౌరవానికి భంగకరమైనవిగా భావించారు. సెక్షన్ 66A (అసభ్యకర కంటెంట్), 153A (గ్రూప్‌ల మధ్య శత్రుత్వం ప్రేరేపించడం) వంటి IPC సెక్షన్‌లు, IT యాక్ట్ కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   పోలీసులు  వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు సేకరించి, దర్యాప్తు ప్రారంభించారు.

మరో వైపు   శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన అరి సినిమా పోస్టర్లను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ధియేటర్లలో చించివేశారు.  . శ్రీకాంత్ కి అవకాశమిస్తే పెద్ద సినిమాలకు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.  

శ్రీకాంత్ అయ్యంగార్ తెలుగు సినిమాల్లో నటుడి పేరు తెచ్చుకున్నారు. తనకు కులం అక్కర్లేదని తన పేరును శ్రీకాంత్ భరత్‌గా మార్చుకున్నారు. పోలీసులకు తనపై అందుతున్న ఫిర్యాదులపై ఆయన ఇంకా స్పందించలేదు.